Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‭కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‭లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మహమ్మద్ సయీద్, ముజఫర్ పరయ్, బల్వన్ సింగ్ సహా సీనియర్ నేతలు శుక్రవారం కాంగ్రెస్‭లో చేరారు. గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ఆజాద్ పార్టీలో వీరంతా సభ్యులు. కొద్ది రోజుల క్రితం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆజాద్‭ను కాంగ్రెస్ తొలగించింది

Jammu and Kashmir: కాంగ్రెస్ పార్టీని వదిలేసి సొంత కుంపటి పెట్టుకున్న జమ్మూ కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్‭కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన స్థాపించిన పార్టీలో చేరిన నేతలు తాజాగా ఘర్ వాపసీ చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేడా సమక్షంలో కొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‭లో కొనసాగున్న నేపథ్యంలో వీరంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం.

MCD Mayor Election: మున్సిపల్ మీటింగులో ఆప్, బీజేపీ మధ్య హైడ్రామా.. మేయర్ ఎన్నిక వాయిదా

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మహమ్మద్ సయీద్, ముజఫర్ పరయ్, బల్వన్ సింగ్ సహా సీనియర్ నేతలు శుక్రవారం కాంగ్రెస్‭లో చేరారు. గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమొక్రటిక్ ఆజాద్ పార్టీలో వీరంతా సభ్యులు. కొద్ది రోజుల క్రితం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆజాద్‭ను కాంగ్రెస్ తొలగించింది. అనంతరం వీరు కూడా ఆయనతో పాటే కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక తాజా చేరికల అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలు మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యమైన రోజు’’ అని అన్నారు.

Bird Flies: ఆగకుండా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి.. సరికొత్త రికార్డు సృష్టించిన గాడ్విట్

ట్రెండింగ్ వార్తలు