Bird Flies: ఆగకుండా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి.. సరికొత్త రికార్డు సృష్టించిన గాడ్విట్

ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు.

Bird Flies: ఆగకుండా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి.. సరికొత్త రికార్డు సృష్టించిన గాడ్విట్

Bird Flies: ఆస్ట్రేలియాకు చెందిన గాడ్విట్ అనే పక్షి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆగకుండా, 11 రోజులపాటు, 13 వేలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యధిక దూరం ఇలా ఆగకుండా ఎగిరిన పక్షిగా నిలిచింది. పరిశోధకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బుక్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాడ్విట్ అనే పక్షికి 234684 అనే నెంబర్ గల శాటిలైట్ బేస్డ్ ట్యాగ్ అమర్చారు.

Twitter Data ‘Breach’: 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. 2 లక్షల డాలర్లకు విక్రయించిన హ్యాకర్లు

పక్షి వీపు భాగంలో ఈ ట్యాగ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ పక్షి ఎక్కడికి వెళ్లినా తెలుసుకోవచ్చు. ఈ ట్యాగ్ శాటిలైట్ ఆధారంగా పని చేస్తుంది. శాటిలైట్ ద్వారా పరిశోధకులు ఈ పక్షి ఎంత దూరం ప్రయాణించిందో గుర్తించారు. ఇది ఎగిరిన దూరం చూసి ఆశ్చర్యపోయారు. ఈ పక్షి గత అక్టోబర్ 13న ఆస్ట్రేలియాలోని అలస్కా నుంచి టాస్మేనియాకు ప్రయాణించింది. టాస్మేనియా ఒక చిన్న ద్వీపం. గాడ్విట్ పక్షి ప్రయాణం 11 రోజులపాటు నిరంతరాయంగా సాగింది. మొత్తం 11 రోజులపాటు ఎక్కడా ఆగకుండా, సముద్రం మీదుగా 13,560 కిలోమీటర్లు ఎగిరింది. మధ్యలో ఎక్కడా ఆహారం, విశ్రాంతి కూడా తీసుకోలేదు. 11 రోజులు గాల్లో ఎగురుతూనే టాస్మేనియా చేరుకుంది.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినా ఈ పక్షి ప్రాణాలు కోల్పోయేది. ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య ఆహారం లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా 13 వేలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించింది. గతంలో ఒక పక్షి అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డును ఇది చెరిపేసింది.

గాడ్విట్ ఇంత దూరం ప్రయాణించడం వల్ల బాగా అలసిపోయి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. తన శరీర బరువులో సగానికిపైగా బరువు తగ్గి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గాడ్విట్ పక్షులు అలస్కా నుంచి న్యూజిలాండ్ వెళ్తుంటాయి. అయితే, ఈ పక్షి దారి తప్పడం వల్ల టాస్మేనియా చేరుకుంది.