Twitter Data ‘Breach’: 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. 2 లక్షల డాలర్లకు విక్రయించిన హ్యాకర్లు

యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది.

Twitter Data ‘Breach’: 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. 2 లక్షల డాలర్లకు విక్రయించిన హ్యాకర్లు

Twitter Data ‘Breach’: ఆన్‌లైన్‌లో యూజర్ల డేటాకు సేఫ్టీ లేకుండా పోతోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. దీంతో యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతోంది. తాజాగా ట్విట్టర్‌కు చెందిన 20 కోట్ల మంది యూజర్ల డేటా లీకైంది.

MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం.. ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, పేరు, స్క్రీన్ నేమ్, యూజర్ నేమ్, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డేట్, ఫాలోవర్ల కౌంట్ వంటివి హ్యాకర్ల ఫోరమ్ సేకరించింది. 8 హ్యాకర్ల ఫోరమ్స్ కలిపి వీటిని సేకరించి, విక్రయించాయి. ఈ నెల 4న స్టే మ్యాడ్ అనే హ్యాకర్ ఫోరమ్ సభ్యుడు ఈ వివరాల్ని వెల్లడించాడు. ర్యుషి యూజర్ నేమ్‌తో ఉన్న ఇంగ్లిష్ సైబర్ క్రైమ్ ఫోరమ్ ద్వారా 20 కోట్ల యూజర్ల డేటాను అమ్మకానికి ఉంచారు.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

ట్విట్టర్ యూజర్ల డేటా లీకైందని గత డిసెంబర్ 23నే వెల్లడైంది. అప్పటి సమాచారం ప్రకారం.. 40 కోట్ల మంది యూజర్ల డేటా లీక్ కాగా, తాజాగా 20 కోట్ల మంది యూజర్ల డాటానే లీకైనట్లు వెల్లడైంది. డేటా లీకేజీ వల్ల ఫిషింగ్, డాక్సింగ్ వంటివి జరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డేటా లీక్స్‌లో ట్విట్టర్ యూజర్ల డేటా లీక్ కూడా ఒకటని సైబర్ నిపుణులు అంటున్నారు. అయితే, డేటా లీక్ వ్యవహారంపై ఇంత దుమారం రేగుతున్నప్పటికీ, దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించలేదు.