Ghulam Nabi Azad
Ghulam Nabi Azad : కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ హయాంతో పోల్చితే ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పనితీరు పేలవంగా ఉందన్నారు. పార్టీలో అపాయింట్ మెంట్ కల్చర్ పెరిగిందని, ప్రజాస్వామ్యానికి తావులేదన్నారు. ఇందిరా గాంధీ వ్యవహారం శైలి మెరుగ్గా ఉండేదని, యూత్ కాంగ్రెస్ చీఫ్ గా తాను ఆమెను ఎంతో దగ్గర నుంచి గమనించే అవకాశం లభించిందన్నారు.
ఇందిరా గాంధీని అప్పట్లో ఏ సమయంలోనైనా కలిసే అవకాశం ఉండేదని.. కానీ, ప్రస్తుతం పార్టీ అధిష్టానాన్నిసంప్రదించే పరిస్థితి లేదన్నారు. తాను బీజేపీ బీ టీమ్ గా వ్యవహరిస్తున్నానని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆజాద్ తోసిపుచ్చారు. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన పలు పొరపాట్లకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.
Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‌కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు
గతంలో కాంగ్రెస్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉండగా ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం పట్టించుకోలేదన్నారు. హిమంత బిశ్వ శర్మ తిరుగుబాటు వ్యవహారాన్ని తాను రాహుల్ కు వివరించగా ఆయనను బయటకు వెళ్లనివ్వండని చెప్పారని తెలిపారు. శర్మ పార్టీని వీడి బీజేపీలో చేరి అసోం సీఎం అయ్యారని వెల్లడించారు.