Viral Video : సీసీ కెమెరా ఉందని మరిచిపోయారా ? ఏటీఎంలో సెంటర్ యువతి ఏం చేసిందో తెలుసా ?

ఏటీఎం సెంటర్ కు ఓ యువతి వచ్చింది. అందులో కార్డు పెట్టి..డబ్బులు తీసుకొనేందుకు వెయిట్ చేస్తోంది. హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ...

Dance

Girl Dances ATM : ఈ మధ్యన సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి సమయంలో వధువు, వరుడు, ఇతర కుటుంబసభ్యులు చేసే డ్యాన్స్..తదితర వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఫన్నీ కంటెంట్ తో వీడియోలు దూసుకపోతున్నాయి. నెట్టింట ఇవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా..ఓ యువతి ఏటీఎంలో చేసిన పనికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది.

ఏటీఎం సెంటర్ కు ఓ యువతి వచ్చింది. అందులో కార్డు పెట్టి..డబ్బులు తీసుకొనేందుకు వెయిట్ చేస్తోంది. హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ…ఆ యువతి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. కాసేపు గ్యాప్ ఇస్తూ.. సింపుల్ గా స్టెప్పులు వేసింది. డబ్బులు రాగానే..లెక్కపెట్టుకుని మరి డ్యాన్స్ చేసింది. అనంతరం బయటకు వస్తూ..ఏటీఎంకు దండం పెట్టడం వీడియోలో హైలెట్ గా నిలిచింది. అసలు ఆ యువతి అలా ఎందుకు ప్రవర్తించిందో తెలియరావడం లేదు. అక్కడనే ఉన్న సీసీ కెమెరాలో ఆ యువతి డ్యాన్స్ రికార్డయ్యింది. దీనిని ghantaa పేరిట ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. 2,907,169 views వచ్చాయి.