Ghulam Nabi Azad resigns: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. రాహుల్‌పై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ మేరకు ఓ లేఖ రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తీరుపై ఆయన ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. రాహుల్ ప్రవేశంతోనే కాంగ్రెస్ కు కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాహుల్ గతంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని అన్నారు.

Ghulam Nabi Azad resigns: కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ మేరకు ఓ లేఖ రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తీరుపై ఆయన ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. రాహుల్ ప్రవేశంతోనే కాంగ్రెస్ కు కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాహుల్ గతంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని అన్నారు.

అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలు పిల్లచేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పోరాట సంకల్పాన్ని, సామర్థ్యాన్ని కోల్పోయిందని అన్నారు.

రాహుల్ నిర్ణయాలు పార్టీ ఐక్యతను దెబ్బతీశాయని చెప్పారు. ప్రస్తుతం భారత్​ జోడో యాత్ర కంటే ముందు పార్టీ​ అధినాయకత్వం కాంగ్రెస్​ జోడో యాత్రను చేపట్టాలని పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనపడడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ఇటువంటి దుస్థితిలో ఉండడం సబబేనా అని నిలదీశారు.

కాగా, జమ్మూకశ్మీర్ లో తాను 1970లో తాను కాంగ్రెస్ లో చేరానని గుర్తు చేశారు. అప్పటి నుంచి పార్టీలో తాను పనిచేసిన తీరును లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ లో సంస్కరణలు తీసుకురావాలంటూ విమర్శలు చేసిన జీ-23 నేతల్లో ఒకరిగా ఆజాద్ ఉన్న విషయం తెలిసిందే. ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం గత ఏడాది ముగిసింది. ఆ తర్వాత ఆయనను మళ్ళీ కాంగ్రెస్ రాజ్యసభకు పంపలేదు. జమ్ముకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలను కూడా ఇటీవల తిరస్కరించారు.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో

ట్రెండింగ్ వార్తలు