Bihar Covid 19
Bihar COVID-19 Vaccination : కరోనా టీకా తీసుకొనేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. వారిలో అవగాహన లేకపోవడమే కారణం. టీకా తీసుకుంటే..ఏమవుతుందోనన్న భయం వారిలో నెలకొంది. ప్రభుత్వం, అధికారులు ఎంత అవగాహన చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. దీంతో వారిని అట్రాక్షన్ చేసే చర్యలు చేపట్టాయి కొన్ని రాష్ట్రాలు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
జులై 15వ తేదీ నాటికి షియోహార్ జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారికి 100 శాతం టీకా ఇవ్వాలని తాము నిర్ణయించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే..ఈ జిల్లాలో ఉన్న 43 గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలు. జులై 15వ తేదీ తర్వాత..ఈ జిల్లాలో ఎంట్రీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. గత సంవత్సరం భారీ వర్షాలు పడితే..భారీగా వరదలు వచ్చాయి. అంతకంటే ముందే..అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించి ఈ ఆఫర్ ప్రకటించామని అన్నారు అధికారులు.
వీలైనంత త్వరగా..వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందన్నారు. అయితే..ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత..వారి పేర్లు ఓ పేపర్ లో రాసి..ప్రతి వారం ఐదుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్స్, కూలర్లు ఇస్తామని వెల్లడించారు. మరి ఈ ఆఫర్ సక్సెస్ అవుతుందా ? అధికారులు భావించినట్లుగా 100 శాతం టీకా పూర్తవుతుందా ? లేదా ? అనేది చూడాలి.
Read More : ITR e-filing 2.0 Portal : ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0 లాంచ్.. కొత్త వెబ్‌సైట్ ఇదే..