Gold Demand: దేశీయంగా గోల్డ్ డిమాండ్ అమాంతం పెరిగిపోవడానికి కారణమిదే..

ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ తొలినాళ్లలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఆసాంతం పసిడి ధరలు..

Gold Demand: దేశీయంగా గోల్డ్ డిమాండ్ అమాంతం పెరిగిపోవడానికి కారణమిదే..

Gold

Updated On : May 18, 2021 / 8:17 PM IST

Gold Demand: ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ తొలినాళ్లలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ ఆసాంతం పసిడి ధరలు పెరిగినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56వేల 200తో రూ.8వేల 500 వరకు తక్కువగానే ఉన్నాయి.

ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే ధరల్లో తగ్గుదల ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన పసిడికి మరింత డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశ్యాన్ని పెంచింది. అలా కొనుగోళ్లు పెరిగిపోయాయి. బంగారం దిగుమతులు పెరిగాయి.

ఏప్రిల్ నెలలో 630 కోట్ల డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదే నెలలో వెండి దిగుమతులు 88.53 శాతం క్షీణించి 1.19 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతుల విలువ కేవలం 283 కోట్ల డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు వెయ్యి 510 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఈ ఏడాది తొలిసారిగా నమోదైన వాణిజ్యలోటు ఇదే. గతేడాది ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు 676 కోట్ల డాలర్లుగా ఉంది. దేశాన్ని వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ప్రభావం.. పొంచి మూడో వేవ్ ప్రభావానికి రాబోయే నెలల్లో డిమాండ్ తగ్గొచ్చనే మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.