Gold-Silver Rates Today : బంగారం బాటలో వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో బంగారం ధరలు మొదట్లో పెరిగినప్పటికీ.. గత వారంగా క్రమంగా బంగారం తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

Gold-Silver Rates Today : దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో బంగారం ధరలు మొదట్లో పెరిగినప్పటికీ.. గత వారంగా క్రమంగా బంగారం తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. శనివారం (జూన్ 19) బంగారం కంటే వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధరల్లో మార్పులేమీ లేవు. స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని నగరాల్లో మాత్రమే బంగారం ధరలు భారీగా తగ్గాయి.

22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,250గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,270గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.600 తగ్గింది.. దాంతో బంగారం ధర రూ.44,250కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ.410 తగ్గింది. దాంతో రూ.48,270కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ధరలతో పాటు

వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100 తగ్గింది. దాంతో ప్రస్తుత వెండి కిలో ధర రూ.74,000 ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.600 మేర తగ్గి 46,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,490 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల (22 క్యారెట్ల) బంగారం ధర 47,350 గా ఉంది. (24 క్యారెట్ల) బంగారం ధర రూ. 48,350 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 10 గ్రాముల (22 క్యారెట్ల) బంగారం ధర రూ. 44,250గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది. బెంగళూరులో రూ.68,600 వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,600 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో వెండి కిలో రూ.74,000ల వద్ద ఉండగా.. విజయవాడలో వెండి రూ.74,000గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు