Gold Smuggling
Gold Smuggling : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గతేడాది నుంచి గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకెతంకు చేరుతుందో అంచనా వేయడం సవాల్ గా మారింది. ఈ పరిస్థితుల్లో గోల్డ్ స్మగ్లర్లు (Gold Smuggling) రెచ్చిపోతున్నారు. గల్ఫ్ దేశాల్లో చౌకగా దొరికే బంగారాన్ని విమానాల్లో, వివిధ మార్గాల్లో భారతదేశంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని విమానాశ్రయాల్లో బంగారంను అక్రమంగా తరలిస్తున్న వారిని అనేకసార్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
Also Read: Gold Prices : పసిడి ప్రియులకు పండగ చేసుకునే న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోనూ ప్రతీయేటా కోట్ల విలువైన బంగారం కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతోంది. అయితే, దేశవ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772 కిలోల బంగారంను అధికారులు సీజ్ చేశారు.
దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడింది. 2015-16 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
పదేళ్లకు సంబంధించిన వివరాలు..
♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,815 కేసులు నమోదు కాగా.. 2,972.07 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,573 కేసులు నమోదు కాగా.. 1,520.24 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3,131 కేసులు నమోదు కాగా.. 3,329.46 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2019-19 ఆర్థిక సంవత్సరంలో 5,092 కేసులు నమోదు కాగా.. 4,292.29 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4,784 కేసులు నమోదు కాగా.. 3,626.85 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,034 కేసులు నమోదు కాగా.. 1,944.39 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,236 కేసులు నమోదు కాగా.. 2,172.11 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,619 కేసులు నమోదు కాగా.. 4,342.85 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,599 కేసులు నమోదు కాగా.. 4,971.68 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
♦ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,005 కేసులు నమోదు కాగా.. 2,600.40 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.