Gold: అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..? బంగారాన్ని ఎక్కడ దాచాడో తెలుసా?

దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.55 కోట్లు..

GOLD

బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కేటుగాళ్లు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి బంగారాన్ని తరలించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. కేటుగాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే వారిని భద్రతా సిబ్బంది పట్టేస్తున్నారు.

తాజాగా, ఉత్తరప్రదేశ్ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.55 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. షార్జా నుంచి ఫ్లైట్ నం 6ఈ1424లో వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పురీషనాళంలో దాచి తీసుకొచ్చాడని వివరించారు.

మొత్తం 554 గ్రాముల బంగారాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ప్రయాణికుడు కాఫీ మిషన్‌లో 3.497 కిలోల బంగారాన్ని దాచి తీసుకొచ్చాడని అధికారులు వివరించారు. ఇతడు IX 194 విమానంలో దుబాయ్ నుంచి లక్నోకు వచ్చాడని చెప్పారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Heart Attack : విషాదం.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో 22 ఏళ్ల యువ‌కుడి మృతి