Blinkit Delivery Executive: అర్థరాత్రి ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. ఓ ప్రాణాన్ని కాపాడిన డెలివరీ బాయ్.. నీది గొప్ప మనసు అంటూ ప్రశంసల వర్షం

ఆర్డర్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అక్కడ పరిస్థితులు చూస్తే అతడికి ఎందుకో డౌట్ వచ్చింది.

Blinkit Delivery Executive: అర్థరాత్రి ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. ఓ ప్రాణాన్ని కాపాడిన డెలివరీ బాయ్.. నీది గొప్ప మనసు అంటూ ప్రశంసల వర్షం

Blinkit Delivery Executive Representative Image (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 7:12 PM IST
  • డెలివరీ బాయ్ మానవత్వం
  • ఆర్డర్ నిరాకరించి ఓ ప్రాణాన్ని కాపాడాడు
  • ఏడుస్తున్న మహిళతో మాట్లాడాడు
  • ఎలాంటి తప్పటడుగు వేయొద్దని నచ్చజెప్పాడు

Blinkit Delivery Executive: ఈరోజుల్లో ఎవరి లైఫ్ వారి. ఎవరి టెన్షన్స్ వారివి. పక్క వాడు ఎలా పోతే మనకెందుకు అని లైట్ తీసుకునే రోజులివి. పక్క వ్యక్తి బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, చివరికి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా.. కొందరు పట్టించుకోని దుస్థితి. అలాంటి ఈరోజుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉన్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నారు. ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుని వారి బాధను పంచుకుని వారికి అండగా నిలిచేవారున్నారు. ఆ కోవలోకే వస్తాడీ డెలివరీ బాయ్. అతడు చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు. నువ్వు చాలా గ్రేట్, నీది చాలా గొప్ప మనసు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ డెలివరీ బాయ్ చేసిన పని అందరి మనసులు గెలుచుకుంది. ఆ డెలివరీ బాయ్ మానవత్వాన్ని మెచ్చుకుంటున్నారు.

అర్థరాత్రి ఏడుస్తూ కనిపించిన మహిళ..

అతడు బ్లింకిట్ డెలివరీ బాయ్. అర్థరాత్రి సమయంలో అతడికి ఓ ఆర్డర్ వచ్చింది. ఎవరో ఎలుకల మందు (ర్యాట్ పాయిజన్) ఆర్డర్ పెట్టారు. ఆ ఆర్డర్ ను రిసీవ్ చేసుకున్న బ్లింకిట్ డెలివరీ బాయ్ వాటిని తీసుకుని లొకేషన్ కు బయలుదేరాడు. ఆర్డర్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అక్కడ పరిస్థితులు చూస్తే అతడికి ఎందుకో డౌట్ వచ్చింది. ఆర్డర్ పెట్టిన మహిళ ఏడుస్తూ కనిపించింది. డిప్రెషన్ లో ఉంది.

అసలే అర్థరాత్రి వేళ. ఆ టైమ్ లో ర్యాట్ పాయిజన్ ఆర్డర్ పెట్టారు. పైగా మహిళ ఏడుస్తూ ఉంది. దాంతో డెలివరీ బాయ్ కి అనుమానం పెరిగింది. ఏదో అనర్థం జరగబోతోందని గ్రహించాడు. ఆ ర్యాట్ పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకుంటారేమో అని డౌట్ పడ్డాడు.

అంతే.. ఆ ఆర్డర్ ను ఆమెకు ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు ఆ మహిళతో కాసేపు మాట్లాడాడు. బాధలో ఉన్న ఆమెకు సర్ది చెప్పాడు. సూసైడ్ చేసుకోవడానికే ఈ విషాన్ని ఆర్డర్ చేశారా అని ఆమెను అడిగాడు. మీ సమస్య ఎంత పెద్దదైనా కావొచ్చు, అయినా మీరు ఎలాంటి తప్పటడుగు వేయొద్దని నచ్చజెప్పి ఆమెను ఒప్పించగలిగాడు. అతడి మాటలు విన్న మహిళ అందుకు అంగీకరించింది. ఆ తర్వాత స్వయంగా అతడే ఆర్డర్ ని క్యాన్సిల్ కూడా చేశాడు. ఈ విషయాన్ని ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ స్వయంగా చెబుతూ వీడియో తీసుకున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూసైడ్ చేసుకుంటుందేమో అని డౌట్?

అర్ధరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన ఓ ఫ్యామిలీకి దాన్ని ఇచ్చేందుకు బ్లింకిట్‌ డెలివరీ బాయ్ నిరాకరించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ర్యాట్ పాయిజన్ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. అర్డర్ పెట్టిన లొకేషన్ కి వెళ్లా. అక్కడ ఓ మహిళ ఏడుస్తూ కనిపించడంతో సూసైడ్ చేసుకుంటుందా అనే డౌట్ వచ్చింది. ఎలాంటి తప్పటడుగు వేయొద్దని ఆమెకు నచ్చ చెప్పి ఆర్డర్ ని క్యాన్సిల్ చేశా’ అని అతడు వీడియోలో చెప్పుకొచ్చాడు.

మానవత్వం చాటుకున్న డెలివరీ బాయ్..

ఎవరు ఏమైపోతే నాకేంటి అని అనుకునే ఈరోజుల్లో.. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, తన పని కాకపోయినా, ఓ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంది. నిజానికి ఆర్డర్ చేరవేయడం వరకే అతడి బాధ్యత. కానీ, అతడు అలా చేయలేదు. తన స్వార్ధం చూసుకోలేదు. బాధలో ఉన్న మహిళతో మాట్లాడి తప్పటడుగు వేయకుండా నిరోధించగలిగాడు. అలా ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు. కొన్నిసార్లు డెలివరీ కంటే మానవత్వమే ముఖ్యం అని అతడు నిరూపించాడని, ఈ రియల్ హీరోకి మా గౌరవ వందనాలు అంటూ నెటిజన్లు కితాబిచ్చారు.