భారీ వర్షానికి ఆకాశం నుంచి బంగారు నాణేలు?
- Subhan Ali Shaik
- Updated on- October 11, 2020 / 12:51 PM IST
వర్షం వస్తే చినుకులు.. కొన్నిసార్లు అరుదుగా వడగళ్లు వరకూ తెలిసిందే. కానీ, బంగారు నాణేలు (gold coins) పడటం తెలుసా.. కర్ణాటక – తమిళనాడు సరిహద్దుల్లోని సర్జాపుర, బాగలూరు పరిధిలో ఇది జరిగిందట. శుక్రవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి ఆకాశం నుంచి బంగారు నాణేల పడినట్లు రూమర్లు వ్యాపించాయి. ఆ విషయం తెలుసుకున్న వందలమంది స్థానికులు రహదారుల పైకి, ఖాళీ స్థలాల్లోకి వచ్చి నాణేల కోసం వేట కొనసాగించారు.
ఉర్దూ అక్షరాలు చెక్కి ఉన్న వందల నాణేలు స్థానికులకు లభించాయి. నాణేలు దొరుకుతున్నాయని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు గుంపులు గుంపులుగా గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అవి దొరికిన వారి దగ్గర్నుంచి నాణేలను స్వాధీనపరుచుకున్నారు.
బంగారు నాణేలు అయి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బంగారపు అయినా అంతకుముందు ఎవరో నేలలో పూడ్చి పెట్టి ఉండొచ్చని, వర్షానికి పైకి వచ్చి ఉంటాయని, బురదతోపాటు కొంత దూరం కొట్టుకు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు స్థానికులు మాత్రం మళ్లీ వర్షం వస్తే నాణేలు కింద పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
