2019లో భారత్ లో గోల్డెన్ ట్వీట్ ఇదే

సోషల్ మీడియాలో భారత ప్రధాని మోడీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్‌లలో మోడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో ఆయనకు 51.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో అత్యంత ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా మోడీ కొనసాగుతురన్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సందర్భంలో మే-23,2019న సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్= విజయీ భారత్ అంటూ మోడీ ట్విటర్‌లో ఇచ్చిన నినాదం విశేష జనాదరణ పొందింది. ఈ ట్వీట్‌ను ఇండియన్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా ట్విటర్ ప్రకటించింది. ఈ ఒక్క ట్వీట్‌కు ఇప్పటిదాకా 4లక్షల 21వేల మంది లైక్‌లు కొట్టగా…దాదాపు 2లక్షల రీట్విట్ లు వచ్చాయి. చేశారు. మే 23న వెలుబడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం ఖరారైన తరువాత ఆ రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు మోడీ ఈ ట్వీట్ చేశారు. 

మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజున ఆయనని విష్ చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ క్రీడాప్రపంచంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్ గా నిలిచింది. కోహ్లీ ట్వీట్ కు 4లక్షలకు పైగా లైక్ లు రాగా,47వేల రీట్వీట్లు వచ్చాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తన బిగిల్ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా 1లక్షకు పైగా రీట్వీట్లు రాగా,2లక్షలకు పైగా లైక్ లను సంపాదించింది. ఇక హ్యాష్ ట్యాగ్ ల విసయానికొస్తే…లోక్ సభ ఎలక్షన్స్ 2019 హ్యాష్ ట్యాగ్ ఎక్కువమంది ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్ నిలిచింది. ఇక భారత్ లో ఈ ఏడాది ఎక్కువమంది చాలా ఆశక్తిగా ఎదురుచూసిన ఈవెంట్ గా ఇస్రో నిర్వహించిన చంద్రయాన్-2 మిషన్ నిలిచింది.