చెన్నైలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్ 15,2019) చెన్నైలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు రావడంతో ఉదయం 11.30

  • Publish Date - December 15, 2019 / 03:50 AM IST

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్ 15,2019) చెన్నైలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు రావడంతో ఉదయం 11.30

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్ 15,2019) చెన్నైలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు రావడంతో ఉదయం 11.30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. గొల్లపూడి పార్థివ దేహానికి నివాళులర్పించిన సినీ, సాహితీ ప్రముఖులు… ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కన్నమ్మపేట దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం(డిసెంబర్ 14,2019) మధ్యాహ్నం గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీ-నగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీ-నగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. గొల్లపూడితో తనకు ఎన్నో స్మృతులున్నాయని చిరంజీవి గుర్తు చేశారు.

గొల్లపూడికి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నివాళులర్పించారు. మారుతీరావుతో తనకు 60 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. తమది విడదీయలేని అనుబంధం అని… గొల్లపూడి లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు… చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం(డిసెంబర్ 12,2019) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్‌ చక్రవర్తి సినిమాతో రచయితగా సినీ లోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా… ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు.