డ్యూటీ టైం అయిపోయిందని రైలును ఆపివేశాడు

  • Publish Date - April 19, 2019 / 07:49 AM IST

డ్యూటీ టైం అయిపోతే ఏం చేస్తాం..ఆఫీసుల్లో అయితే రిలీవర్ వచ్చే వరకు వెయిట్ చేసి..వారు వచ్చిన తరువాత బాధ్యతలు అప్పచెప్పి వెళ్లిపోతాం అంటారు కదా…రవాణా సంస్థలు..అంటే..ఆర్టీసీ..రైళ్ల విషయానికి వస్తే వారు నడుపుతున్న బస్సులు..రైళ్లను డిపోలు..స్టేషన్‌లు లేదా వారికి కేటాయించిన ప్రాంతాల్లో అప్పగించడం..ఇతరత్రా లెక్కలు అప్పచెప్పి వెళుతుంటారు. అయితే చెన్నైలో మాత్రం గూడ్స్ ట్రైన్‌ను ఓ డ్రైవర్ అర్ధాంతరంగా వైదీశ్వరన్ కోవిల్ స్టేషన్‌‌లో వదిలేసి వెళ్లిపోయాడు. ఏమంటే టైం అయిపోయిందని సమాధానం చెప్పాడు. దీనితో రెండు గంటలకు పైగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

నైవేలీ నుండి బొగ్గు లోడ్‌తో గూడ్స్ రైలు వస్తోంది. నాగపట్నం జిల్లా వైదీశ్వరన్ కోవిల్ స్టేషన్‌లో ఆపివేశాడు డ్రైవర్. సిగ్నల్ ఇచ్చినా రైలు కదలలేదు. దీనితో స్టేషన్ మాస్టర్ కంగారుపడిపోయాడు. టెక్నికల్ సమస్యలు వచ్చాయేమోనని సిబ్బందికి సమాచారం అందించాడు. తీరా..డ్రైవర్‌కి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది. తన టైం ముగిసిందని..అందుకే రైలును నిలిపివేసి వెళ్లినట్లు నింపాదిగా చెప్పాడు. ఆ స్టేషన్ మీదుగా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయడంతో మరలా వచ్చిన ఆ డ్రైవర్ రైలును ముందుకు పోనిచ్చాడు. రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.