TikTok పోటీగా..Google App Tangi

  • Publish Date - January 31, 2020 / 05:33 AM IST

Tik Tok ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది టిక్ టాక్ వీడియోలు తీస్తూ..సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమందికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. 2019లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌ల‌లో టిక్ టాక్ రెండోస్థానం సంపాదించడం విశేషం. దీనిని బీట్ చేయడానికి గూగుల్ రెడీ అయ్యింది. తాజాగా షార్ట్ – ఫార్మ్ వీడియో టాంగి యాప్‌ను ప్రారంభించింది.

ప్రయోగాత్మకంగా సామాజిక వీడియోలను షేర్ చేయగలదు ఈ యాప్. టాంగి యాప్..ఇంక్యుబేటర్ ఏరియా 120 నుంచి అభివృద్ధి చేయబడింది. ఇది ఇప్పుడు యాప్ స్టోర్, tangi.coలో అందుబాటులో ఉంచింది. ప్రతి రోజు కొత్త విషయాలను త్వరగా DIY వీడియోలతో తెలుసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందని గూగుల్ వెల్లడించింది. 

ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉందని, కళాత్మకంగా, వంటలు, స్టైల్ వంటి ఇతర అంశాలను 60 సెకన్లలోపు రికార్డు చేసి షేర్ చేయవచ్చని టాంగి యాప్ వ్యవస్థాపకులు వెల్లడించారు. 
60 సెకన్ల లాంగ్ వీడియోలు కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధి గల వీడియోలను కూడా అప్ లోడ్ చేయవచ్చు. 
గూగుల్ యొక్క టాంగి యాప్ ఆపిల్ యాప్ స్టోర్, IOSలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం అందుబాటులో లేదు. 
ప్రస్తుతానికి అప్ లోడ్ చేసే సామర్థ్యం అందరికీ అందుబాటులో లేదని, వినియోగదారులు వెయిట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. 

Read More : ఇదో వెరైటీ : కాకి మాంసంతో చికెన్ వెరైటీలు