Young girls dance: మహాభారత్‌ టైటిల్ సాంగ్‌కి బాలికల డ్యాన్స్.. అదిరిపోయిందంతే..

ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్న బాలికలు స్టేజీపై చేసిన డ్యాన్స్ ఎన్నిసార్లు చూసినా మరోసారి..

‘వింటే భారతమే వినాలి.. తింటే గారలే తినాలి’ అని పెద్దలు చెబుతుంటారు. మీరు గనక ఈ బాలికల వీడియోను చూశారంటే.. ఇకపై ‘చూస్తే ఇటువంటి వీడియోనే చూడాలి’ అంటారు. స్టార్ ప్లస్‌ ఛానెల్ సీరియల్ ‘మహాభారత్’ టైటిల్ సాంగ్‌కు కొందరు బాలికలు చేసిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

‘హై కథా సంగ్రామ్ కీ’ పాటకు ఆ బాలికలు చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఈషా మిశ్రా అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘7 మిలియన్ల వ్యూస్‌ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.. హై కథా సంగ్రామ్‌కీ’ అనే క్యాప్షన్‌తో ఈషా మిశ్రా ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ గూస్‌బంప్స్ కొరియోగ్రఫీని అనురాధాఝా డైరెక్ట్ చేశారని.. మ్యామ్ లవ్ యు వెరీ మచ్ అని ఈషా మిశ్రా పేర్కొన్నారు. ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్న బాలికలు స్టేజీపై చేసిన డ్యాన్స్ ఎన్నిసార్లు చూసినా మరోసారి చూసేలా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఆ బాలికలు చిన్నప్పుడే ఇంతలా అందరినీ అలరిస్తూ డ్యాన్స్ చేస్తుంటే పెద్దయ్యాక ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా డ్యాన్స్ చేస్తారని కొందరు కామెంట్లు చేశారు.

అమెరికాలోని టీనేజర్లలో ఈ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన వైనం