కరోనా వ్యాక్సిన్ డెలివరీ…కోల్డ్ చైన్ స్టోరేజీ సదుపాయాల వేటలో ప్రభుత్వం

Government begins mapping cold chain storage facilities మరికొన్నిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాన్ని త్వరగా డెలివరీ చేసేందుకు కోల్డ్ చైన్ స్టోరేజీలను సిద్దం చేసే పెద్ద కార్యక్రమాన్ని ఇప్పుడు కేంద్రం మొదలుపెట్టింది.


వ్యాక్సిన్ ను సులభంగా దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు తాలుకా స్థాయిల్లో వ్యాక్సిన్ ను స్టాక్ చేసి ఉంచే కోల్డ్ స్టోరేజీలు లేదా ఫ్రిడ్జ్ లను గుర్తించేందుకు ఫార్మాస్యూటికల్ సెక్టార్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మరియు ఆగ్రో బిజినెస్ లోని పబ్లిక్ మరియు ప్రేవేట్ స్టెక్టార్ కంపెనీలతో ఓ జాతీయ ఎక్స్ పర్ట్ గ్రూప్ మాట్లాడుతున్నట్లు సమాచారం.


అదేవిధంగా అదేవిధంగా స్విగ్గీ,జొమాటో వంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్స్ తో మాట్లాడుతున్నట్లు తెలిసింది. వచ్చే వారంలో వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన డ్రాఫ్ట్ స్కీమ్ రిలీజ్ అయ్యే అవకాశముందని విశ్వసనీయవర్గాల సమాచారం. చాలా వరకు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ…. ఎక్కువ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ కి సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా,-80డిగ్రీల సెల్సియల్ కంటే తక్కువ ఉష్టోగ్రతలతో కోల్డ్ సప్లై చైన్ అవసరమవుతుంది. మెజార్టీ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ద్రవ రూపంలో ఉండనున్నట్లు సమాచారం. కాగా, రాబేయే 3-4నెలల్లో భారత్ లో కనీసం ఒక దేశీయ,3విదేశీ కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.