వాహనదారులకు ఊరట : ఫాస్టాగ్ గడువు పెంపు 

  • Publish Date - November 30, 2019 / 05:01 AM IST

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవేలపై టోల్ ఫీజు వసూలుకు ఉపయోగించే ఫాస్టాగ్ విధానం అమలు గడువును పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద కేవలం ఫాస్టాగ్‌తోనే టోల్ చెల్లింపులు ఉంటాయని గతంలో చెప్పిన కేంద్రం.. తాజాగా ఆ గడువును డిసెంబరు 15 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.

దేశంలోని అనేక టోల్ ప్లాజాల దగ్గర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను ఏర్పాటు చేసింది. అక్కడ వాహనదారులకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ ఇస్తున్నారు. ఫాస్టాగ్‌ కోసం 150 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా  భరిస్తోంది. డిసెంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలనుకున్న ప్రభుత్వం.. వాహనదారులు ఫాస్టాగ్ పొందేందుకు తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో గడువును పొడిగించింది. 

పండుగలు… పబ్బాలు వచ్చాయంటే టోల్ ప్లాజాల  దగ్గర చాంతాండంత  క్యూ ఉంటుంది. గంటల తరబడి క్యూలైన్ లో ఆగి టోల్ ఫీజుకట్టి వెళ్లాల్సి వచ్చేది  వాహనదారులు. ఇలా వారు ప్రయాణించే దారిలో అన్ని టోల్ ప్లాజాలు టాక్స్ కట్టాల్సి వచ్చేది.  దాంతో ఎంతో సమయం వృధా అయ్యేది. వారికి ఊరట కలిగించేందుకు  కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చింది.  డిసెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్‌గేట్ల వద్ద ‘ఫాస్టాగ్‌’ అమలు చేయనున్నామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు. కానీ … వాహనదారుల సౌకర్యార్ధం ఇప్పుడు ఆ గడువును డిసెంబర్ 15 వరుకు పొడిగించారు. ప్రతి వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్‌ను అమర్చి. ఈ టాగ్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు అనుసంధానం చేస్తామని గతంలోనే అధికారులు తెలిపారు. దాంతో మొబైల్‌ వాలెట్‌ లేదా ప్రత్యేక కౌంటర్‌లలో ఫాస్టాగ్‌ను రీచార్జ్‌ చేసుకును అవకాశం ఉంటుంది. దింతో టోల్ ప్లాజా వద్ద నిరీక్షించే సమయం ఉండదు.