దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కంపెనీలలో ప్రొవిడియంట్ ఫండ్‌లో ఎంప్లాయిర్, ఎంప్లాయీ రెండు షేర్లను ప్రభుత్వమే చెల్లించనుంది. ఆర్థిక ప్యాకేజీలో ప్రకటనలో భాగంగా ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రూ.1.7 లక్షల కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
100 వరకు ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో నెలకు రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉంటే వారికి ప్రభుత్వమే పీఎఫ్ రెండు (ఎంప్లాయిర్, ఎంప్లాయీ) షేర్లను చెల్లించనుంది. రూ.15వేల వేతనం కంటే తక్కువగా ఉన్నవారు 90శాతం వేతనాన్ని పొందుతున్నవారికి ఈ ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం చెల్లించే ఈ మొత్తం మూడు నెలలకు అయ్యే ఖర్చు రూ.4,800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఎంప్లాయిస్ ప్రొవిడియంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మొత్తం 6 కోట్ల మంది సభ్యులు ఉన్నారు.
100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు మాత్రమే ప్రస్తుత ప్రతిపాదన వర్తిస్తుంది. అందులో 90 శాతం మంది ఉద్యోగులు నెలకు రూ.15వేల లోపు వేతనం తీసుకుంటుండాలని అధికారి ఒకరు వెల్లడించారు. 100 మంది ఉద్యోగులు ఉంటే.. పూర్తిగా లేదా గణనీయంగా ఎక్కువ సంస్థలను కవర్ చేయడానికి పెంచవచ్చునని చర్చల గురించి తెలిసిన అధికారి ఒకరు చెప్పారు. సాధారణ పీఎఫ్ సహకారం.. ఉద్యోగి ప్రాథమిక వేతనం (బేసిక్ పే)లో 24శాతం వరకు ఉంటుంది. అందులో 12శాతం ఉద్యోగి నుండి.. మిగిలినది కంపెనీ నుంచి వస్తుంది. ‘ప్రభుత్వం రెండు పరిస్థితులలో అదనపు ఆర్థిక సమస్యలను పరిశీలిస్తోంది. Capను పూర్తిగా తొలగించడం లేదా గణనీయంగా పెంచే దిశగా యోచిస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’ అని అధికారి తెలిపారు.
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం విధించడంతో తీవ్రంగా నష్టపోయిన MSMEలకు ఉపశమనం ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. కంపెనీలపై భారాన్ని తగ్గించడానికి, ఉద్యోగ నష్టాలు, జీతాల కోతలను నివారించడానికి అన్ని సంస్థలను కవర్ చేయడానికి దీనిని పెంచాలని ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఉద్యోగ కోతలు లేదా జీతాల కోతలపై గ్రౌండ్ లెవల్ అంచనాను చేపట్టాలని, ఉన్నత విధాన రూపకర్తల ముందు నివేదికను సిద్ధం చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే EPFOను కోరింది.