Women Employees Work From Home
Women Employees Work From Home : మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అకవాశాన్ని కల్పించింది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్ధల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళలకు వర్క్ ఫ్రం హోం అనుమతిస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రకటించారు.
ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లోత్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. వేతనం ఎంత ఇవ్వాలనేది ఆయా డిపార్ట్‌మెంట్లు, సంస్ధలు నిర్ణయించనున్నాయి. 20 శాతం మంది మహిళలను నియమించుకున్న సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందజేయనుంది.
Work From Home : ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. కేంద్రం కీలక నిర్ణయం
ఈ పథకానికి రాజస్థాన్ ప్రభుత్వం రూ 100 కోట్ల కేటాయించింది. ఆరు నెలల్లో 20,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కాగా ఇప్పటివరకూ 150 మంది మహిళలు, 9 కంపెనీలు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.