ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవటం కుదరదు. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్ధ (ఉడాయ్) కొత్త రూల్స్ రూపోందించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆధార్ లో పుట్టని తేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంది.
ఆధార్ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టిన తేదీ ఇలా దేనిలోనైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోటానికి వీలుగా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం ఇంతకాలం ఉండేది. ఈ అవకాశాన్ని చాలా మందిదుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఉడాయ్ కొత్తగా నిబంధనలు తీసుక వచ్చింది. ముఖ్యంగా పేరు పుట్టిన తేదీ ఇష్టాను సారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.
>ఆధార్ కార్డులో మీ పేరులో తప్పులుంటే ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది
>పుట్టిన తేదీ, జెండర్ మార్పు(లింగం) ను సరైన ఆధారాలతో కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలి.
>ఆధార్ కార్డులో ప్రస్తుతం ఉన్న పుట్టినతేదీకి మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
>నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులకుసంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్ లేదా పోస్టు ద్వారా పంపించాలి.
>సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ ఆధార్ కార్డులో మార్పులు చేయాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
>మీరు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోయినా, ప్రాంతీయ కార్యాలయం అధికారులు కార్డుదారు నుంచి మరింత సమాచారం కోరతారు. దానికి కార్డు దారుడు స్పందించాలి.
>ప్రాంతీయ కార్యాలయం అధికారులు అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ కూడా చేయిస్తారు. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధారణకు వచ్చినప్పుడే కార్డును అప్ డేట్ చేస్తారు.