ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అంతే కాదు కాశ్మీర్ సందర్శన కోసం వెళ్లొద్దని రెండేళ్ల వరకు అక్కడికి పర్యాటకులు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాశ్మీర్ కు మాత్రమే కాదు, అమర్ నాథ్ యాత్రకు కూడా రెండేళ్ల వరకు వెళ్లొద్దని మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గవర్నర్ పోస్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది సమర్ధిస్తుంటే మరికొంత మంది గవర్నర్ తీరును తప్పుపడుతున్నారు.