రామమందిర నిర్మాణానికి కేంద్రం బోణి : 1 రూపాయి విరాళం

  • Publish Date - February 6, 2020 / 10:42 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళాన్నిస్తూ బోణి కొట్టింది. ఈ విరాళాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఫిబ్రవరి5, బుధవారంనాడు పార్లమెంటులో  ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే రామమందిరం నిర్మాణానికి ఇచ్చే విరాళాలకు ఎటువంటి షరతులు వర్తించవని, అందువల్ల ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ట్రస్ట్‌ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఈ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి విరాళంగా అందించి బోణీ కొట్టింది. ఈ విరాళాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ నగదు, ఆస్తుల రూపంలో ఎలా ఇచ్చినా విరాళాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రస్టు కార్యాలయం మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇంటి కేంద్రంగా కొనసాగుతోందని, త్వరలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళాన్నిస్తూ బోణి కొట్టింది. ఈ విరాళాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’  పేరుతో టస్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఫిబ్రవరి5, బుధవారంనాడు పార్లమెంటులో  ప్రకటించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టును ఏర్పాటు చేస్తునట్లు మోడీ తెలిపారు. ఆలయ నిర్మాణంలో అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారు. వారిలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్టుకు ప్రముఖ న్యాయ కోవిదుడు పరాశరన్ ఛైర్మన్ గా  నియమితులయ్యారు.

అయితే రామమందిరం నిర్మాణానికి ఇచ్చే విరాళాలకు ఎటువంటి షరతులు వర్తించవని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ట్రస్ట్‌ సభ్యులు కోరారు. నగదు, ఆస్తుల రూపంలో ఎలా ఇచ్చినా విరాళాలు స్వీకరించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ట్రస్టు కార్యాలయం మాజీ అటార్నీ జనరల్‌, ట్రస్టు చైర్మన్ పరాశరన్‌ ఇంట్లో కొనసాగుతోందని, త్వరలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

రామమందిర నిర్మాణం కోసం మూడు నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు 2019, నవంబరు 9న ఆదేశాలు జారీచేసింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి విషయంలో తుది తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది.
 
కాగా….రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో ప్రముఖ న్యాయవాదులు, ధర్మ గురువులు, అయోధ్య మాజీ రాజ కుటుంబం సభ్యుడు నిర్మోహి అకాడా తదితర సంస్థలకు స్థానం లభించింది. అయోధ్య జిల్లా కలెక్టర్ ప్యాట్రన్ ట్రస్టీగా వ్యవహరిస్తారు. ట్రస్టు బోర్డు సభ్యులందరు కలిసి ఒకరిని అధ్యక్షునిగా నియమించుకుంటారు. ట్రస్టులోని సభ్యులందరు కూడా తప్పని సరిగా హిందువులై ఉండాలి. ప్యాట్రన్ ట్రస్టీగా వ్యవహరించే అయోధ్య కలెక్టర్ హిందువు కాని పక్షంలో హిందు మతానికి చెందిన అదనపు కలెక్టర్ ప్యాట్రన్ ట్రస్టీ సభ్యుడుగా వ్యవహరిస్తారు. సుప్రీం కోర్టులో దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు అయోధ్య రామ మందిరం కోసం వాదించిన ప్రముఖ న్యాయవాది కే. పరాశరన్ ట్రస్టు చైర్మన్ గా నియమితులయ్యారు.

ప్రయాగ్‌రాజ్‌లోని జ్యోతిష్య పీఠాధీశుడు శంకరాచార్య స్వామి వాసు దేవానంద్ సరస్వతీజీ మహారాజ్, కర్నాటకలోని ఉడిపిలో ఉన్న పేజావర్ పీఠాధిపతి చెందిన జగద్గురు మధ్వాచార్య స్వామి విశ్వ ప్రసన్న తీర్థజీ మహారాజ్, హరిద్వార్‌లోని ఆఖండ ఆశ్రమానికి చెందిన యుగ పురుష్ పరమానంద జీ మహారాజ్, మహారాష్టల్రోని అహమద్ నగర్‌కు చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్, అయోధ్య రాజ కుటుంబానికి చెందిన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా, అయోధ్యలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు అనీల్ మిశ్రా, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 1989లో శిలాన్యాస్ జరిగినప్పుడు మొదటి ఇటుక పెట్టిన దళితుడు, పాట్నా నగరానికి చెందిన కామేశ్వర్ చౌపాల్, నిర్మోహీ అకాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్ (దాస్‌కు ట్రస్టులో ఓటు వేసే హక్కు ఉండదు) ఉన్నారు. 

వీరితో పాటు ట్రస్టు బోర్డు ఇద్దరు హిందువులను సభ్యులుగా నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన తరపున ఒక ఐఏఎస్ అధికారిని సభ్యునిగా నామినేట్ చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తన ప్రతినిధిగా ఒక ఐఏఎస్ అధికారిని ట్రస్టు సభ్యునిగా నియమిస్తుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఒకరిని తమ అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులందరు తప్పని సరిగా హిందువులై ఉండాలి.