ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. బీపీ కనుంగో ప్రస్తుత పదవీకాలం ఏప్రిల్-2,2020తో ముగియనుందపి ఆర్బీఐ ఇవాళ(మార్చి-31,2020)ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఏప్రిల్-2017లో కనుంగో బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐలో మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లు(నుంగో, ఎన్ ఎస్ విశ్వనాధన్,ఎమ్ కే జైన్, మైఖేల్ డీబాబ్రాట పాత్ర) ఉన్నారు.