Drones To Deliver Covid Vaccines : డ్రోన్లతో పల్లెలకు వ్యాక్సిన్లు

రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం.

Drones To Deliver Covid Vaccines రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు, క్లిష్టమైన కొండ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్ర ప్రభుత్వం. డ్రోన్ల ద్వారా..మారుమూల గ్రామాలు, రాకపోకలకు కష్టమైన కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు టీకాలను చేరవేయాలని నిర్ణయించిన కేంద్రం..టెండర్లు ఆహ్వానించింది.

ఈ నెల 22 లోగా బిడ్లు దాఖలు చేయాలని ఐసీఎంఆర్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ ఇన్‌ఫ్రా టెక్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. ఐసీఎంఆర్‌ తరఫున డ్రోన్లతో వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది.

డ్రోన్లతో డెలివరీ చేయడానికి కాన్పూర్ ఐఐటీతో కలిసి ఇప్పటికే ప్రమాణిక నిర్వహణ నియమాలను రూపొందించింది ఐసీఎంఆర్. వాటి ప్రకారం డ్రోన్లు కనీసం 35కి.మీలు ప్రయాణించాలి. కనీసం 4కేజీల బరువు మోయగలగాలి. డెలివరీ చేసిన అనంతరం డ్రోన్లు తిరిగి కమాండ్​ స్టేషన్​కు చేరుకోవాల్సి ఉంటుంది పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు