సంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది.
రూ.15వేల లోపు జీతం ఉండి వంద లోపు ఉద్యోగులున్న సంస్థలకే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం.. ప్రభుత్వం 24 శాతం వ్యక్తిగత వేతనాల్లో (12 శాతం ఉద్యోగులు, 12 శాతం సంస్థ నుంచి) రాబోయే మూడు నెలల పాటు కంపెనీలకు ఈపీఎఫ్ మొత్తాన్ని చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో పరిస్థితుల దృష్ట్యా సంఘటిత రంగ కార్మికులకు ఈ ప్రకటన జారీ చేసింది. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ రెగ్యులేషన్‌లో సవరణలు చేసినట్టు నిర్మలా తెలిపారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నవారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ 75శాతం వరకు లేదా మూడు నెలల వేతనం ఇందులో ఏది తక్కువ అయితే అది తీసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం 4 కోట్లకు పైగా ఉద్యోగులకు ఊరట కలిగించే విషయమే.
కరోనా రిలీఫ్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం లక్షా 70వేల కోట్లను ప్యాకేజీని ప్రకటించింది. వైద్యా,ఆరోగ్య, పారిశుథ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లకు కలిపి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది. వలస కూలీలు, రోజువారీ కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం వెల్లడించింది.
పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. దేశ ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకూడదు అనేది తమ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే మూడుల నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్ట కేంద్రం తెలిపింది.
See Also | కేంద్రం కరోనా ప్యాకేజ్: నేరుగా అకౌంట్లలోకి డబ్బులు