ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్‌లో ఉన్న రూ .35వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయ నష్టానికి పరిహారంగా రాష్ట్రాలకు ఈ మేరకు నిధులను విడుదల చెయ్యనుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు త్వరలోనే రూ.35వేల కోట్లను కేంద్రం విడుదల చేయనుంది.
రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుంది. ఈ మేరకు జీఎస్టీ నష్టాల చెల్లింపులకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం ఆధారం చేసుకోనుంది. ఇప్పటివరకు కేంద్రం జీఎస్టీ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.2,10,969.49కోట్లను చెల్లించాయి.
ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫండ్స్‌ను బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఎ ప్రకారం, ఎఫ్‌వై 20లో రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహార నిధిలో రూ .15,000-25,000 కోట్ల కొరత ఉండవచ్చు. అక్టోబర్ 2019-జనవరి 2020 కాలానికి రాష్ట్రాల జీఎస్టీ పరిహారం 60,000-70,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి-సెప్టెంబర్ 2019 కాలానికి కేంద్రం ఇప్పటికే లక్ష లక్షల కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేసింది.
జీఎస్టీ రోల్ అవుట్ కారణంగా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పటికే 2019 డిసెంబర్‌లో కేంద్రం రాష్ట్రాలకు రూ .35,298 కోట్లు విడుదల చేసింది.