నోయిడా థర్మాకోల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • Publish Date - March 26, 2019 / 10:52 AM IST

నోయిడా : ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధర్మాకోల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ దట్టంగా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి 10 ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా మంటలు తీవ్రంగా వ్యాపించటంతో అవసరమైతే మరిన్ని ఫైర్ ఇంజన్లను తరలించాల్సి వస్తుందని  చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎకె సింగ్ చెప్పారు. పోలీసులు కూడా భారీగా మోహరించి సహాయక చర్యల్ని చేపట్టారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది.