International Womens day 2023..Shaliza Dhami
International Womens day 2023..Shaliza Dhami : ఒకప్పుడు వంట ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. నింగీ,నేల మాదేనంటున్నారు. ఆకాశంలో గెలుపు సంతకాలు చేస్తున్నారు. పురుషులు మాత్రమే చేయగలరు అనే రంగాల్లో కూడా రాణిస్తు మహిళలకు అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. సమస్యలను ఎదుర్కొంటూ ఇంటా బయటా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ మల్టీ టాలెంట్ మా సొంతం అని నిరూపిస్తున్నారు. అటువంటి మహిళలు దేశం కోసం మేమున్నామంటున్నారు. భారత ఆర్మీలో అడుగు పెట్టి త్రివిధ దళాల్లో జయకేతనం ఎగురవేస్తున్నారు. భర్తలను దేశం కోసం అర్పించినా..దేశం కోసం మేము కూడా సేవలందిస్తామంటూ ఆర్మీలో చేసి దేశ సేవకు అంకితమవుతున్నారు. ఆర్మీలో ఎన్నో రకాల సేవలుంటాయి. వీటిలో యుద్ధ భూమిలో అడుగు పెట్టి శతృవుల భరతం పట్టే బాధ్యతల్లో కూడా మేమున్నామంటోంది భారత నారీ శక్తి. అటువంటి నారీ శక్తిని చాటేందుకు నావికాదళంలో మొదటి మహిళా కమాండర్ గా చరిత్ర సృష్టించారు షాలిజా ధామి..!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి నియమించింది భారత వైమానిక దళం. మహిళా దినోత్సవం ముందు రోజున ధామినికి బాద్యతలు అప్పగించింది వైమానిక దళం. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉన్న అత్యంత క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ అయిన ధామి..భారతదేశం అత్యంత సున్నితమైన సరిహద్దు సెక్టార్‌లలో కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షించనున్నారు. మహిళలు యుద్ధభూమిలో విధులు నిర్వహించడం ఇదే మొదటిసారి.పైగా భారత వైమానిక దళం దాదాపు 90 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఇటువంటి బాధ్యతలు నిర్వహించటం తొలిసారి కావటం విశేషం. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన భారత వైమానిక దళంలో ధామి తన దైన ముద్ర వేశారు.
షాలిజా ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా వాయుసేనలోకి అడుగుపెట్టి..క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ గా పేరుతెచ్చుకున్నారు . వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసిన ధామికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధామికి బాధ్యతలు అప్పగించి పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ధామి వైమానిక దళం మొదటి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ తో పాటు వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్ అని తెలిపారు.
ధామికి ఈ బాధ్యతలు అప్పగించిన సందర్భంగా సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా మాట్లాడుతూ..యుద్ధ భూమిలో..కమాండ్ నియామకాలలో మహిళా అధికారులను నియమించడం అనేది ఓ మైలురాయి అని అభివర్ణించారు. ఓ ఉమెన్ ఆఫీసర్ నాయకత్వం వహించే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు సాయుధ బలగాలకు కీలకమైన కార్యాచరణ ఆస్తిగా ఉంటాయని స్పష్టంచేశారు.