Bangladesh Hindus:ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై మూకుమ్మడి దాడి: ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు

గురువారం రాత్రి 150 మందికి పైగా దుండగులు గుంపుగా వచ్చి ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.

Iskcon

Bangladesh Hindus: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని “ఇస్కాన్ రాధాకాంత” ఆలయంపై దుండగులు దాడి చేయడం సంచలనంగా మారింది. గురువారం రాత్రి 150 మందికి పైగా దుండగులు గుంపుగా వచ్చి ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. ఢాకాలోని వారి థానాలోని 22 లాల్ మోహన్ సాహా స్ట్రీట్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని..హాజీ షఫీవుల్లా అనే ముస్లిం నేత ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు ఢాకాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) తెలిపింది. ఈదాడిలో ఆలయంలో ఉన్న ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారని..ఆలయంలో ఉన్న భగవత్ మూర్తిని ధ్వంసం చేసి, డబ్బు మరియు ఇతర విలువైన వస్తువులను దోచుకున్నట్లు HAF ప్రతినిధులు తెలిపారు. హిందువులు మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్ లో తరచూ హిందువుల ఆలయాలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.

Also Read: Stabbed Teacher: స్కూల్లో 30ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి 101సార్లు పొడిచిన పూర్వ విద్యార్థి

తాజా దాడిపై ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ, “ఈ దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు దేశంలోని హిందూ మైనారిటీలకు భద్రత కల్పించాలని” విజ్ఞప్తి చేశారు. హిందువుల ఆర్తనాదాలకు మౌనంగా ఉన్న UN వంటి నామమాత్రపు సంస్థల సహకారం కోసం వేచి చూడడం హిందువులు ఆపాలని ఈ ఘటనను ఖండిస్తూ రామన్ దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం, ఐక్యరాజ్యసమితి మార్చి 15ను ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిందని.. అదే ఐక్యరాజ్యసమితి వేలాది మంది నిస్సహాయ బంగ్లాదేశీ & పాకిస్తానీ మైనారిటీల బాధలపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని రాధారామన్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో చాలా మంది హిందూ మైనారిటీలు తమ ప్రాణాలను కోల్పోయారని, అత్యాచారాలకు గురయ్యారని, అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఇస్లామోఫోబియా గురించి ఆలోచిస్తుందని రాధారామన్ దాస్ విమర్శించారు.

Also read: MLA Shakeel : ఆ కారు ఎమ్మెల్యే షకీల్‌‌దే ?.. పోలీసుల అనుమానాలు

గత అక్టోబరులో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ మత స్థలాలపై వరుస దాడులు జరిగిన కొన్ని నెలల అనంతరం ఇస్కాన్ ఆలయంపై తాజా దాడి జరిగింది. గతేడాది అక్టోబర్ 16న బంగ్లాదేశ్‌లోని నోఖాలీ నగరంలోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసిన విధ్వంసకారులు ఒక హిందూ భక్తుడిని హతమార్చారు. అక్టోబర్ 13న కుమిల్లాలోని పూజా మంటపం వద్ద ఖురాన్‌ను అవమానించారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి, ఇది దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో హింసకు దారితీసింది.

Also read: Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!