Gujarat cable bridge collapse: గుజరాత్‌లో తీవ్ర విషాదం నింపిన కేబుల్ బ్రిడ్జి.. ఇది ఎప్పుడు కట్టారో? ఎవరు కట్టారో? ఎంత పాతదో తెలుసా?

గుజరాత్ లో ఘోర విషాదానికి కారణమైన మోర్బీలో కేబుల్ బ్రిడ్జి 143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు.

Gujarat cable bridge collapse: గుజరాత్ లో ఘోర విషాదానికి కారణమైన మోర్బీలో కేబుల్ బ్రిడ్జి చాలా పురాతనమైనది. వందేళ్ల కిత్రం కట్టినది. ఈ వంతెనను 143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు. నాడు 3.5లక్షల వ్యయంతో దీని నిర్మాణం చేపట్టగా.. బ్రిడ్జ్ కు అవసరమైన మెటీరియల్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు.

దర్బార్ గఢ్-నాజర్ బాగ్ ను కలుపుతూ దీన్ని నిర్మించారు. ఈ వంతెన పొడవు 765 అడుగులు. దీనికి 5 రోజుల క్రితమే మరమ్మతులు చేశారు. గత రెండేళ్లుగా ఈ కేబుల్ వంతెన మూసివేయబడి ఉంది. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న మరమ్మతుల తర్వాత తిరిగి తెరుచుకుంది.

గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందగా, అనేకమందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వంతెనపై వందల మంది ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నదిలో పడిన అనేకమందిని సహాయక సిబ్బంది, పోలీసులు కాపాడారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందింస్తూ, 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామన్నారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం. బ్రిడ్జి కూలిన ఘటనపై 5 సభ్యుల బృందం దర్యాఫ్తు చేయనుంది. మరోవైపు మచ్చు నదిలో సహాయక చర్యలు

కొనసాగుతున్నాయి. NDRF, SDRF, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కేబుల్ బ్రిడ్జి కూలింది. మోర్బీలో జరిగిన దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది సందర్శకులు ఈ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. సాయంత్రం బ్రిడ్జి ఉన్నట్లుండి కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో బ్రిడ్జిపై 150 మందికిపైగా ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో చాలామంది నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు