బ్రేకింగ్: కార్లు వెళ్తుండగా కూలిపోయిన భారీ వంతెన

  • Publish Date - October 7, 2019 / 05:23 AM IST

గుజరాత్‌ రాష్ట్రంలోని జునాగఢ్‌లో మలంక గ్రామానికి సమీపంలో ఓ నదిపై నిర్మించిన ఓ భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ పై నుంచి కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూప్పకూలడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కూలిన వంతెన మధ్య ఇరుక్కున్న వాహనాలను బయటకు తీసుకుని వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

వంతెన కూలిపోవడంతో నాలుగు కార్లు పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వంతెన 500 మీటర్ల వరకు పగుళ్లు కనిపించగా మధ్యలో వంతెన విరిగిపోయింది. జునాగఢ్‌ నుంచి ముంద్రాకు అనుసంధానంగా ఉన్న రోడ్డులో ఈ బిడ్జ్ ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.