Scorpio Ambulance : ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే..

ప్రవీణ్ భాయ్ అనే యవకుడు తన స్కార్పియోను అంబులెన్స్ గా మార్చి కరోనా బాధితులకు ఫ్రీగా సేవలందిస్తున్నారు. అంబులెన్సులు దొరకక్కా..దొరికినా వేలకు వేలు డబ్బులు గుంజేస్తున్న ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్న పరిస్థితులను చూసిన ప్రవీణ్ తన స్కార్పియోను అంబులెన్స్ గా మార్చి ఫ్రీగా సేవలందిస్తున్నారు.

Inspiration Man Scorpio Free Ambulance

Inspiration man Scorpio Free Ambulance : ఈ కరోనా సమయంలో బాధితుల కోసం ఎంతోమంది సహాయం చేయటానికి ముందుకొస్తున్నారు. పేదలు కూడా మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. తమ వాహనాలను అంబులెన్స్ లుగా మారి ఉచితంగా సేవలందిస్తున్నారు. కొంతమంది తమ ఆటోలను అంబులెన్స్ లుగా మార్చి సేవలందిస్తుంటే..కశ్మీర్ లో ఓ యువకుడు తన బోటునే అంబులెన్స్ గా మార్చి బాధితులకు సేవలందిస్తున్నాడు. అటువంటి మరో వ్యక్తి తన స్కార్పియో వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి కరోనా బాధితులకు ఉచితంగా సేవలందిస్తున్నాడు. గుజరాత్ కు చెందిన ప్రవీణ్ భాయ్ అనే యవకుడు తన స్కార్పియోను అంబులెన్స్ గా మార్చి బాధితులకు నేనేన్నానంటూ భరోసా ఇస్తున్నాడు.

ఈ కరోనా సెకండ్ వేవ్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రికి వస్తున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో బాధితులకు తగిన అంబులెన్సులు ఉండటంలేదు. ఆస్పత్రుల దగ్గర కూడా ట్రీట్‌మెంట్ల కోసం క్యూలే దర్శనమిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కొంత మంది పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాక అక్కడ బెడ్ లభించకపోతే మరో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కూడా వేలుగుంజేస్తున్నారు. ఇటువంటి ఘటనలు చూసిన చాలామంది మనస్సులు ద్రవించిపోయి తమ వాహనాలను అంబులెన్స్ లుగా మార్చి బాధితులకు సహాయం చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో గుజరాత్ కు చెందిన ప్రవీణ్ భాయ్… తన స్కార్పియో వాహనాన్ని ఫ్రీ అంబులెన్స్ సేవలందిస్తున్నారు.

ప్రవీణ్ భాయ్ నరోడాలో  ఉంటారు. కొన్నేళ్లుగా ఆయన తన వాహనాల్లో ఒక దాన్ని ఉచిత అంత్యక్రియల సేవల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ వచ్చాక… ప్రవీణ్ భాయ్… కరోనా పేషెంట్ల కోసం ఏమైనా చెయ్యాలని అనుకుని తన స్కార్పియో వాహనాన్ని అంబులెన్స్‌లా మార్చి.. దాంట్లో ఎంతోమంది బాధితులను ఆస్పత్రులకు ఉచితంగా తీసుకెళ్లుతున్నారు.

ప్రవీణ్ భాయ్ స్నేహితుడి బంధువొకాయన కరోనాతో చనిపోగా..యారు. ఆ అంత్యక్రియలకు ప్రవీణ్ వెళ్లగా..వేలు ఖర్చు పెట్టినా… పేషెంట్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ టైముకు రాలేదనీ..దీంతో దారిలోనే పేషెంట్ చనిపోయారనీ… డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేని వాళ్లు కన్నీరు పెట్టటంతో ప్రవీణ్ భాయ్ చలించిపోయారు. దీంతో తన స్కార్పియోను అంబులెన్స్ గా మార్చి తన శక్తికి మించి సేవలందిస్తున్నారు.

నరోడా చుట్టుపక్కల ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే… వెంటనే ఈ స్కార్పియోపై ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని అవగాహన కల్పించారు. అలా ఒక్క ఫోన్ చేస్తే చాలు..తన స్కార్పియో నిమిషాల్లోనే వాలిపోతారు ప్రవీణ్ భాయ్. స్కార్పియో కాబట్టి చాలా ఫాస్టుగా బాధితుల్ని ఆస్పత్రికి చేర్చగలుగుతున్నారు. తద్వారా ప్రాణాల్ని నిలుపుతున్నారు. అలా కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను ఫ్రీగానే నరోడాకి దగ్గర్లో ఉన్న శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. కట్టెలను కూడా ట్రక్కులో సొంత ఖర్చులతో ఇస్తున్నారు ప్రవీణ్ భాయ్.