Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న బీజేపీ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు

గుజరాత్ మంత్రి అరవింద్ రయాని ఇనుప గొలుసులతో వీపుకేసి బాదుకున్నారు. పైగా ఇది మూఢనమ్మకం కాదు అని చెప్పుకొచ్చారు సదరు మంత్రిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారటంతో మంత్రి అయి ఉండి ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Gujarat Minister Arvind Raiyani గుజరాత్ మంత్రి అరవింద్ రయాని ఇనుప గొలుసులతో వీపుకేసి బాదుకున్నారు. పైగా ఇది మూఢనమ్మకం కాదు అని చెప్పుకొచ్చారు సదరు మంత్రిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారటంతో మంత్రి అయి ఉండి ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రిగారు స్పందించారు. దీన్ని మూఢనమ్మకంగా చూడవద్దని సూచించారు.పైగా నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు మధ్య చాల పలుచటి గీతే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. మంత్రి అరవింద్ రయాని గొలుసులో బాదుకుంటుంటే పక్కనే ఉన్నవారు కరెన్సీ నోట్లు చల్లటం వీడియోలో ఉంది. మంత్రి అలా కొట్టుకోవటానికి బీజేపీ కూడా సమర్థిస్తోంది.

గురువారం (మే 26,2022)రాజ్ కోట్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మంత్రి అరవింద్ పాల్గొన్నారు. అక్కడి దేవతా పూజలో భాగంగా ఇనుప గొలుసులతో తనను తాను బాదుకుని శిక్షించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లడాన్ని వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘నా చిన్న నాటి నుంచి దేవతకు భక్తుడిని. మా స్వగ్రామంలో మా కుటుంబం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. దీన్ని మూఢనమ్మకం అని అనొద్దని కోరారు. ఇది మూఢనమ్మకం కాదు మాదేవతమీదున్న నమ్మకం అని వివరించారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ మంత్రిగా ఉండి..ఇటువంటి అశాస్త్రీయమైన చర్యలతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని విమర్శించారు. కానీ ఇటువంటివి వ్యక్తిగత మత విశ్వాసాలకు సంబంధించినవని బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి యగ్నేష్ దవే వివరించారు.సంప్రదాయ ఆచారాలను మూఢనమ్మకాలుగా పేర్కొనకూడదని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాంగ్రెస్ మానుకోవాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు