No Mask : 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం

  • Publish Date - November 23, 2020 / 05:56 AM IST

Gujarat, people without masks earned Rs 78 crore : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుడా..రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. Mask ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. ఎన్నిమార్లు హెచ్చరించినా..పెడచెవిన పెడుతున్నవారి నుంచి ఫైన్ ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు గుజరాత్ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే ముందున్నారనే చెప్పవచ్చు. జూన్ 15 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మాస్క్ లు ధరించని వారికి అధికారులు చలాన్లు విధిస్తున్నారు.



ఇప్పటి వరకు 26 లక్షల మంది నుంచి రూ. 78 కోట్లు జరిమాన వసూలు చేశారు. ఈ మొత్తం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సంవత్సరపు ఆదాయం కంటే…ఎక్కువ అని అధికారులు అంటున్నారు. గుజరాత్ కెవాడియాలో 2018 అక్టోబర్ 31న ఏకతా విగ్రహాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత..పర్యాటకుల నుంచి ఏడాదిలో రూ. 63.50 కోట్ల ఆదాయం వచ్చింది.
అహ్మదాబాద్ లో ప్రతి నిమిషానికి అత్యధికంగా 120 మందికి జరిమాన విధించారు.



మాస్క్ లు ధరించాలని చెబుతున్నా..కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో..జరిమాన మొత్తాన్ని పెంచాలనే డిమాండ్స్ కూడా వచ్చాయి. ఇక మాస్క్ ధరించని వారికి తప్పనిసరిగా కరోనా టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ రిపోర్టు పాజిటివ్ గా వస్తే..రూ. 1000 జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఇక భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 45 వేల 209 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 501 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,33,227కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆదివారానికి 85,21,617కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,40,962గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు