Gujarat : Valsad man 9AC theft : గుజరాత్ లోని వల్సాద్. ఓ జబర్ధస్త్ దొంగ. ACలే వాడి టార్గెట్. ACలు కనిపిస్తే చాలు వాడి చేతులు దురదపుడతాయి. వాటిని కొట్టేసేదాకా నిద్రపోడు. అలా అతను తను పనిచేసే కంపెనీలోని ఏసీల్ని కొట్టేశాడు. ఆ తరువాత లబోదిబోమన్న కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇంటి దొంగగారి గుట్టు బైటపడింది. ఆ తరువాత సదరు దొంగగారిని జైలుకు తరలించగా పాపం నాకు ఉక్కపోస్తోంది నా సెల్ లో ఏసీ పెట్టిస్తారా? అంటూ అడిగాడు.
ఓ రోజున కూల్ గా ఆ ఏసీని ఎత్తుకెళ్లిపోయాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా. అలా కంపెనీలో ఒక్కో ఏసీ కనిపించకుండా పోయాయి. అలా మొత్తం తొమ్మిది ఏసీలు కనిపించకుండాపోయాయి. దీంతో సదరు కంపెనీకి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కంపెనీకి వచ్చి… దర్యాప్తు ప్రారంభించారు.
https://10tv.in/jharkhand-ranchi-man-bmw-luxury-carrying-car-garbage/
అప్పటి నుంచి ప్రారంభమైన పోలీసుల దర్యాప్తుకు ఈనాటికి ఫలితం దక్కింది. ఈ కేసును ఛేదించారు. అతుల్ కంపెనీలో ఏసీల దొంగ… కంపెనీలో ఉద్యోగేననీ అతనే నీలేష్ ఈశ్వర్ భాయ్ పటేల్ అని తేల్చారు. ఆ వెంటనే అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు నీలేష్‌ని అరెస్టుచేసి అతని నుంచి 2 ఏసీలనూ స్వాధీనం చేసుకుని అనంతరం అతను ఎవరికైతే అమ్మాడో అవి దొంగతనం చేసి పట్టుకొచ్చి అమ్మినవని చెప్పి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో… జరిగిన చోరీని సక్సెస్ ఫుల్‌గా ఛేదించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నీలేష్ పోలీసుల్ని ఓ ప్రశ్న వేశాడు.
‘‘నన్ను మీరు అరెస్ట్ చేశారు కదా ఎలాగూ జైల్లో పెడతారు..మరి జైల్లో ఏసీలు ఉంటాయా?’’ అని అడిగాడు..దానికి పోలీసులు ‘‘ఏమిరా నువ్వే చేసింది ఏసీల దొంగతనం అయినంత మాత్రాన నీకు జైల్లో ఏసీలు పెడతారేంట్రా అంటూ రెండు తగిలించాడు. జైల్లో ఏసీలుండవుగానీ గాలి మాత్రం ఫ్రీగా దొరుకుతుందిలే నువ్వే చూస్తావుగా’’ అని కౌంటర్ ఇచ్చారు.
కాగా లాక్‌డౌన్ సమయంలో…అతుల్ కంపెనీలో పనిచేసే 90 శాతం మంది ఉద్యోగులు లీవ్ తీసుకున్నారు. కానీ నీలేష్ మాత్రం లీవ్ తీసుకోలేదు. అతనితో పాటు మరో 10 శాతం మంది మాత్రం డ్యూటీ చేశారు. డ్యూటీలో భాగంగా… అతుల్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న కొత్త ప్లాంటులో 9 ఏసీలు సెట్ చెయ్యాల్సి ఉంది. వాటిని నీలేష్ కంపెనీ ఏర్పాటు చేసి కొత్త ప్లాంటుకు తీసుకెళ్లాడు. కానీ వాటిని సెట్ చెయ్యకుండా ఎత్తుకెళ్లిపోయాడు.
తన ఇంట్లో దాచిపెట్టాడు. పైగా కొత్త ప్లాంటులో చోరీ జరిగిందనీ బిల్డప్ ఇచ్చాడు. ప్లాంటుకి వేసిన తాళాన్ని విరగొట్టేసి చోరీ జరిగినట్లుగా నమ్మించాడు. కొత్త ప్లాంట్కావడంతో… అక్కడ ఇంకా సీసీ కెమెరాలు సెట్ చెయ్యకపోవటం చోరీ ఎవ్వరి చేశారనే విషయం తెలియలేదు. దీంతో సదరు కంపెనీ పోలీసు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డ్యూటీలో ఉన్నవారందరినీ ప్రశ్నించగా నీలేజ్ అత్యుత్సాహంతో సమాధానాలు చెప్పటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
అలా నీలేష్ పై నిఘా పెట్టారు. కానీ నీలేశ్ అను తేలిగ్గా చిక్కలేదు. కానీ మూడు నెలల తర్వాత కేసు సాల్వ్ అయ్యింది. ఈ మూడు నెలల్లో అతను 7 ఏసీలను అమ్మేశాడు. మరో 2 ఏసీల్ని ఇంట్లో దాచిపెట్టటంతో అతని ఇల్లు గాలించటంతో అవి బైటపడ్డాయి. దీంతో నీలేశ్ పై చర్యలు తీసుకుంటున్నారు.