బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా 13మంది చనిపోగా 30మందికి పైగా గాయపడ్డారు.

అయితే శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సామాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద ఘటనపై సీఎం అమరీందర్ సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు.