Gurugram : అల్లావుద్దీన్ మ్యాజిక్ కార్పెట్.. దీనిపై మీరు రైడ్‌కి వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసా?

అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలన్నా.. అల్లావుద్దీన్ మ్యాజిక్ కార్పెట్ అన్నా.. అందరూ ఇష్టపడతారు. గురుగ్రామ్ వీధుల్లో మ్యాజిక్ కార్పెట్‌పై ఓ యువకుడు అచ్చంగా అలాగే హల్చల్ చేశాడు.. మీరు ఆ మ్యాజిక్ కార్పెట్‌పై రైడ్‌కి వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసా?

Gurugram

Gurugram : అరేబియన్ నైట్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు అందర్నీ అలరిస్తాయి. ఆ కథలో అల్లావుద్దీన్ ఎక్కడికి వెళ్లాలన్నా ఒక చాప మీద వెళ్తుంటాడు. అచ్చంగా అలాగే ప్రయత్నించాడు గురుగ్రామ్‌కి చెందిన కెవిన్ కౌల్ అనే కుర్రాడు. అతని చేసిన ప్రాంక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Happy Birthday Virat Kohli: కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ఎవరెవరు విషెష్ చెప్పారంటే.. ట్వీట్లు వైరల్

గురుగ్రామ్‌కి చెందిన కంటెంట్ క్రియేటర్ కెవిన్ కౌల్ అల్లావుద్దీన్‌లాగ దుస్తులు ధరించడానికి ఇష్టపడతాడు. అంతేకాదు సరదాగా ప్రాంక్స్ చేస్తుంటాడు. తరచు తన దగ్గర ఉన్న ‘మ్యాజిక్ కార్పెట్’ పై వీధుల్లో తిరుగుతూ అందర్నీ అలరిస్తుంటాడు. కొందరు మిస్టర్ కౌల్ ‘మ్యాజిక్ కార్పెట్’ పై వెళ్లే విధానాన్ని ఇష్టపడితే.. కొందరు అసలు ఆ కార్పెట్ ఎలా కదులుతోందో తెలియక ఆశ్చర్యపోతుంటారు.

Payal Ghosh : బాలీవుడ్ నటులు బాలకృష్ణ సర్‌ని చూసి నేర్చుకోవాలి.. హీరోయిన్ ట్వీట్ వైరల్..

ఇన్‌స్టాగ్రామ్‌లో కౌల్ షేర్ చేసిన వీడియోలో వీధుల్లో స్కేట్‌బోర్డ్‌‌పై స్వారీ చేస్తూ కనిపించాడు. అందర్నీ పలకరిస్తూ ముందుకు వెళ్లాడు. ఓ షాపు నుంచి ఐస్‌క్రీం కూడా తీసుకుంటాడు. నిజానికి 2022 నాటి ఈ పాత వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. కౌల్ వీడియో చూసి నెటిజన్లు ‘చలాన్ కట్టావా?’ అని సరదాగా ప్రశ్నించారు. అందుకు కౌల్ ‘స్పష్టంగా.. స్కేట్‌బోర్డింగ్ చట్టాలు లేవు.. కాబట్టి నాకు చలాన్ లేదు’ అని బదులిచ్చాడు. ఇంకా తన వీడియోలో ‘ఉచిత మ్యాజిక్ కార్పెట్ రైడ్‌ను గెలుచుకోవాలంటే కామెంట్ సెక్షన్లో ముగ్గురు స్నేహితులకు ట్యాగ్ చేయమని’ శీర్షిక పెట్టాడు. మొత్తానికి కౌల్ తన మ్యాజిక్ కార్పెట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.