Gyanvapi Masjid
Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ఉన్న శివలింగానికి కార్బన్ డేటింగ్ జరిపించాలని, దానిపై శాస్త్రీయ పరిశోధన చేయించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్లను వారణాసి కోర్టు ఇవాళ తిరస్కరించింది. జ్ఞానవాపి మసీదు అంశం కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలో సర్వే పూర్తి చేసి, ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి, దాని నివేదికను కోర్టుకు అందజేసింది.
అయితే, ఆ నివేదికలోని అంశాలు బయటకు రావడం వివాదాస్పదమైంది. ‘మసీదులో పురాతన ఆలయ శిథిలాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దేవతల విగ్రహాలు, శేషనాగు, నాగఫణి శిల్పాలు ఉన్నాయని నివేదిక ద్వారా తెలిసింది. మసీదు వెనక ఓ గోడపై కళాత్మక నమూనాలు ఉన్నాయన్న అంశం బహిర్గతమైంది. దీంతో, ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆ సమయంలో ఆదేశించింది. కార్బన్ డేటింగ్ జరిపించాలని హిందూ సంఘాలు పిటిషన్లు వేశాయి. దీనిపైనే కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..