కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్రమే అని అన్నారు.
హెయిర్ సెలూన్లు, బార్బర్ షాపులు సర్వీస్ చేసినా వారికి సడలింపు లేదన్నారు. కటింగ్ షాపులు, సెలూన్లకు అనుమతివ్వలేదని ఆమె తేల్చి చెప్పారు. అలాగే మద్యం దుకాణాలు తెరవాలని కూడా ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
కొత్త ఆదేశాల ప్రకారం రెస్టారెంట్లు కూడా తెరవడానికి వీలులేదన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చని…షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీలు లేదని ఆమె తెలిపారు. ఇక పట్టణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో షాపులు తెరుచుకునే అవకాశం కల్పించామన్నారు.
కాగా… ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ గా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం సడలింపులనుఢిల్లీలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు.ప్రస్తుతం అమలవుతున్ననిబంధనలే అన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయని చెప్పారు.