కరోనీ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో 16రెట్లు పెరిగిన శానిటైజర్‌ ధర

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 04:57 AM IST
కరోనీ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో 16రెట్లు పెరిగిన శానిటైజర్‌ ధర

Updated On : March 9, 2020 / 4:57 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వాప్తి చెందుతోంది. ఈ పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ లక్షణాలతో సంఖ్య పెరిగిపోతున్నారు. ఈ సందర్భంగా Flipkartలో హ్యాండ్‌ శానిటైజర్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోతుంది. 30ml బాటిల్‌ రేటు దాదాపు 16రెట్లు పెరిగింది. 

కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చేతులను ఎప్పుడు శుభ్రంచేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో ప్రజల శానిటైజర్లకను విపరీతంగా వాడుతేన్నారు. దీనివల్ల షాపుల్లో శానిటైర్ల కొరత ఏర్పడింది. దీంతో అందరూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఛాన్స్ అనుకుని Flipkart వంటి ఇ-కామర్స్‌ సంస్థలు వాటి రేట్లను పెంచాయి. (Corona Effect : హోలీ వద్దంటున్న AIMS)

Flipkartలో సూపర్‌ రిటైల్స్‌ పేరుతో 30ml హిమాలయ హ్యాండ్ శానిటైజర్‌ రేటు రూ.999లకు విక్రయిస్తున్నారు. అసలు ధర కన్నా ఇది 16 రెట్లు ఎక్కువ.  దీంతో ప్రజలకు అవసరమైనప్పుడు శానిటైజర్ల రేటును విపరీతంగా పెంచడంపై పలువురు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. 

అత్యవసర పరిస్థితుల్లో 30ml శానిటైజర్‌ను రూ.999లకు అమ్మడం ఎంత వరకు న్యాయం అని ఓ యువతి ట్విట్‌ చేశారు. అంతేకాదు MRP రేటు కన్నా ఎక్కువ రేటుతో అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని Flipkartను ట్యాగ్‌ చేస్తూ హిమాన్షు కుమార్‌ ట్వీట్‌ చేశారు.