Hanuman Jayanti 2023 : అంజనీపుత్రుడికి నైవేద్యంగా అతివలు తయారు చేసిన టన్ను బరువున్న లడ్డు..

హనుమంతుడి జయంతి సందర్భంగా జబల్‌పుర్‌లోని పురాతన పంచమాతా హనుమంతుడికి మహిళలు టన్ను బరువున్న లడ్డూను తయారు చేశారు.

One Tonne laddoo Prasad for Jabalpur Hanuman

Hanuman Jayanti 2023 : హనుమంతుడి జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని జబల్‌పుర్‌లో ఉన్న పురాతన పంచమాతా హనుమంతుడి ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఏప్రిల్ 6 (2023) గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా అంజనీపుత్రుడికి నైవేద్యంగా భారీ లడ్డూను సమర్పించనున్నారు. దీని కోసం టన్ను బరువున్న లడ్డూను తయారు చేశారు.

సాధారణంగా లడ్డూ అంటూ వినాయక చవితి ఉత్సవాలు గుర్తుకొస్తాయి. కానీ జబల్‌పుర్‌లో ఉన్న పురాతన పంచమాతా హనుమంతుడి లడ్డూను ప్రసాదంగా పెట్టే ఆచారాన్ని గత ఏడాది నుంచి ఆలయ నిర్వహకులు ప్రారంభించారు. దీంట్లో భాగంగా హనుమంతుడికి భారీ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూని మహిళలే స్వయంగా తయారు చేయటం విశేషం. టన్ను బరువున్న ఈ లడ్డూని తయారు చేయటానికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పనులు నిర్వహించారు. కేవలం ఏడు రోజుల్లో.. నాలుగు అడుగుల ఎత్తైన భారీ లడ్డూను సిద్ధం చేశారు మహిళలు.

హనుమాన్‌ జయంతి సందర్భంగా వేద మంత్రాలతో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఆ లడ్డూని భక్తులకు అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని కూడా పంచిపెడతారు. కాగా..జబల్ పూర్ లోనే ఈ హనుమంతుడిని ఆలయాన్ని చాలా సంవత్సరాల క్రితం గోండు రాజులు నిర్మించారు. ఈ పురాతన దేవాలయానికి హనుమాన్ జయంతి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.