Happy Birthday Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే. 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మోదీ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యింది బీజేపీ. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కోటి 50 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read More : PM Modi : రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని..”సెంట్రల్ విస్టా” విమర్శకులపై ఫైర్
దేశ ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని పుట్టిన రోజున.. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్. దేశం తరపున రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ వ్యాక్సిన్ల వల్లే కోవిడ్ నుంచి ప్రజలను కాపాడుకోగలుతున్నామని చెప్పారు. కోవిడ్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్న మోదీకి ఇది మంచి బహుమతన్నారు తరుణ్‌చుగ్.
Read More :PM Modi : క్వాడ్ భేటీ, హాజరు కానున్న మోదీ
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారణాసిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ మాతా ఆలయం దగ్గర 71 వేల దీపాలు వెలిగించబోతున్నారు. ఈ దీపాలను వెలిగించడంతోపాటు.. 14కోట్ల రేషన్ బ్యాగ్‌లను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఆ బ్యాగ్‌లపై థ్యాంక్యూ మోదీజీ అని ముద్రించారు. వీటితోపాటు ప్రధాని నరేంద్రమోదీ ఫోటోతో కూడిన ఐదు కోట్ల పోస్టుకార్డులను దేశ వ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల నుంచి పంపించనున్నారు.