PM Modi : క్వాడ్ భేటీ, హాజరు కానున్న మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోడీ హాజరు కానున్నారు.

PM Modi : క్వాడ్ భేటీ, హాజరు కానున్న మోదీ

Pm Modi

Quad Summit :  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన చేయనున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదె సుగాలు హాజరు కానున్నారు.

Read More : Farmers : 2018-19లో సాగు ద్వారా రైతులు రోజుకు రూ.27 సంపాదించారు!

గత సంవత్సరం మార్చి నెలలో మొట్టమొదటిసారిగా వర్చువల్ గా క్వాడ్ సమావేశం జరిగింది. ప్రస్తుతం జరిగే క్వాడ్ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్చ, కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటంలో సహకారం..తదితర అంశాలపై నాలుగు దేశాలు చర్చించనున్నాయి. కరోనా వైరస్ నుంచి రిక‌వ‌రీ, పున‌ర్ నిర్మాణం, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను గౌర‌వించ‌డం లాంటి అంశాల‌ను ఈ ఏడాది థీమ్‌గా యూఎన్ ఎంచుకుంది.

Read More : Afghan Police Back : తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపు..డ్యూటీలో చేరిన అఫ్గాన్ పోలీసులు

గతంలో జరిగిన సమావేశంలో ఇండో – పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారంపై అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు ప్రధానంగా చర్చించారు. చైనా సముద్రంలో ఏకపక్ష అధిపత్య వైఖరి…నేపథ్యంలో స్వేచ్చాయుత జల రవాణాపై క్వాడ్ నేతలు చర్చించనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన న్యూయార్క్ లో నిర్వహించే ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశంలో మోదీ పాల్గొనున్నారు.