Afghanistan : తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపు.. డ్యూటీలోకి అఫ్గాన్ పోలీసులు

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక..ఎయిర్ పోర్టులో జరిగిన పరిణామాలతో ఎంతోమంది పోలీసులు డ్యూటీలు మానేసారు. ఈక్రమంలో తాలిబన్స్ కమాండర్ పిలుపుతో తిరుగి డ్యూటీలో చేరారు.

Afghanistan  : తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపు.. డ్యూటీలోకి అఫ్గాన్ పోలీసులు

Afghan Police Back On Duty

Afghan Police Back : అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడ అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నమైపోయాయి. ఆంక్షలు..తాలిబన్ల అరాచకాలతో పోలీసు వ్యవస్థ కూడా చెదిరిపోయింది. ఎంతోమంది పోలీసులు తాలిబన్లకు భయపడి డ్యూటీలకు కూడా వెళ్లటం లేదు. తాము చెప్పినట్లు చేయకపోతే ఎక్కడ ప్రాణాలు తీసేస్తారోననే భయంతో చాలామంది పోలీసులు డ్యూటీలకు వెళ్లటం మానేసారు. ముఖ్యంగా అఫ్గాన్ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు భయపడి డ్యూటీ చేసే పోలీసులు డ్యూటీలు మానేశారు.

Read more : Afghanistan : ధైర్యం చేసి ఉద్యోగంలో చేరిన అఫ్ఘాన్ మహిళలు

ఈక్రమంలో తాలిబన్ల కమాండర్స్ పోలీసులకు..‘మీ డ్యూటీల్లో మీరు చేరవచ్చు.. పిలునిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే వచ్చి డ్యూటీల్లో చేరారు. దీంతో తిరిగి తాము డ్యూటీల్లో చేరటం చాలా సంతోషంగా ఉందని.. తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపుతో మ‌ళ్లీ డ్యూటీల్లో చేరామని పోలీసు అధికారులు తెలిపారు. డ్యూటీ మానేసి ఇంటిలో రెండు వారాలపాటు ఉండిపోయామని..తిరిగి డ్యూటీల్లో చేరటం చాలా హ్యీపీగా ఉందని తెలిపారు.

Read more :Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

డ్యూటీలో చేరిన పోలీసులు ఎయిర్‌పోర్టులోని ప్ర‌ధాన భ‌వ‌నాల వ‌ద్ద‌, చెక్ పాయింట్ల వ‌ద్ద పోలీసులు మోహరించారు. కాగా..గత ప్రభుత్వంలో పనిచేసిన సైనికులు, పోలీసులతో సహా తాలిబన్లు ఇతర భద్రతా శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ తాము క్షమాభిక్ష పెట్టామని తాలిబాన్లు చెప్పుకొచ్చారు.

Read more :UNO : అఫ్ఘాన్‌కు ఐక్యరాజ్యసమితి 2 కోట్ల డాలర్ల ఆర్థికసాయం

ఆగస్టు 30 న యుఎస్ బలగాల ఉపసంహరణతో ముగిసిన తరువాత లక్షమందికిపైగా పైగా ప్రజలు కాబూల్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లిపోయారు. ఈక్రమంలో తరలిపోతున్న ప్రజల్ని అడ్డుకోవటానికి తాలిబన్లు..ప్రజల్ని సురక్షితంగా తరలించటానికి అమెరికా బలగాలకు జరిగిన ఘర్షణ..తద్వారా జరిగిన కాల్పులు..జరిగిన పేలుళ్లతో ఎయిర్ పోర్టు తీవ్రంగా దెబ్బతింది.

ఆగస్టు 15 న ప్రభుత్వ బలగాలను మట్టుబెట్టిన తర్వాత కాబూల్‌లోకి దూసుకెళ్లిన తాలిబాన్లు.. ఖతార్ సాంకేతిక సహకారంతో రాజధాని విమానాశ్రయాన్ని మళ్లీ తిరిగి నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్ఘనిస్తాన్‌కు సాయాన్ని అందించడానికి ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. విమానాలు వందల టన్నుల వైద్య, ఆహార సామాగ్రిని తీసుకొస్తున్నాయి. దీంతో తిరిగి పోలీసులను తిరిగి డ్యూటీలో చేరమని తాలిబన్ కమాండర్ పిలుపినివ్వటంతో పోలీసులు డ్యూటీల్లో చేరారు.