Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

Afghanistanculture అంటూ మహిళలు నినదిస్తున్నారు.DoNotTouchMyClothes అంటూ తమ గళాలను వినిపిస్తున్నారు.

Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

Afghanistanculture (1)

Afghanistanculture : అణచివేస్తే అపరకాళికలవుతాం. నిర్భంధిస్తే నీ పీచమణుస్తాం. మేం ధరించే దుస్తుల జోలికొస్తే సహించేది లేదు. మా దుస్తులే మా గళం అని నిరసిస్తున్నారు అఫ్గాన్ దేశపు మహిళలు. ఇదే మా సంస్కృతి అంటూ #Afghanistanculture పేరుతో మహిళలు గళాలు వినిపిస్తున్నారు. అణచివేత ధోరణికి పోరాటాలతో చరమగీతం పాడి హక్కులు సాధించుకుంటామంటున్నారు అఫ్గాన్ మహిళలు. ఆధిపత్య భావజాలానికి చరమగీతం పాడుతామంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన అణచివేతల నుంచి ఎటువంటి నిరసన గళాలు వినింపించాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

Taliban enter Afghanistan capital Kabul

అణచివేతలకు ఎదురొడ్డి హక్కుల సాధనకు కృషి చేసిన ఉద్యమ గాథలు ఈ ప్రపంచానికి కొత్తకాదు. 20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై అత్యంత దారుణమైన హింసలకు పాల్పడుతున్నారు. అంతులేని ఆంక్షలను విధిస్తున్నారు. క్రీడాకారిణులను ఆటలాడితే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉగ్యోగినులకు ఇంటి బయట కాలు పెడితే కాళ్లు నరికేస్తాంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై తాలిబన్లు విధిస్తున్నా ఆంక్షల బాబితాకు అంతు ఉండదు. ఈ క్రమంలో అఫ్గాన్ లో మహిళలు తమ గళాలను వినిపిస్తున్నారు. రకరకాల దుస్తులు ధరించి ఇదే అఫ్గాన్ సంస్కృతి అని నినదిస్తున్నారు.

taliban

అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడి మహిళలు ఇప్పుడు మరోసారి తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వస్త్రధారణ, విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు.ఆగష్టు 15న రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల గత అరాచక పాలనను గుర్తుచేసుకుని దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఎంతగా బెంబేలెత్తిపోయారో ప్రపంచం మొత్తం చూసింది. దేశం నుంచి పారిపోయినవారు ఎంతోమంది. పారిపోదామనుకునే వారు ఇంకెంతో మంది. కానీ ఎంతకాలం ఇలా పారిపోయి బతుకుతాం? ఉన్నచోటే మా హక్కులు సాధించుకుంటామంటున్నారు ఎంతోమంది అఫ్గాన్ మహిళలు. మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోమంటూ తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ ఇవి కేవలం కల్లబొల్లి కబుర్లే అనటానికి ఎన్నో రోజులు పట్టలేదు.

 

కో ఎడ్యుకేషన్‌ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, తమ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నత పదవులు(మంత్రి) ఉండవని చెప్పడం స్త్రీల పట్ల వారు అనుసరించబోయే విధానాలను చెప్పకనేచెప్పాయి. పురుషుల తోడు లేకుండా ఆడవాళ్లు ఇంటి బయటకు రావద్దని చెప్పడం,వస్త్రధారణ పట్ల ఆంక్షలు, ఉద్యోగినులు ఆఫీసులకు వెళ్లకూడదని చెప్పటం. క్రీడాకారిణులు ఆటలు ఆడొద్దని హెచ్చరించటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో. ఈక్రమంలో మహిళలు తాలిబన్ల కట్టుబాట్లకు తలొంచేది లేదని..తమ స్వేచ్చకు భంగం కలిగితే ఊరుకునేది లేదని గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన స్త్రీలు.. సోషల్‌ మీడియా వేదికగా మరో ఉద్యమానికి తెరతీశారు.

Read more : Pakistan New Rule: ఉపాధ్యాయులు జీన్స్,టీ షర్టులు ధరించకూడదు..పాకిస్తాన్ సర్కార్ హుకుం

 

అఫ్గన్‌ సంస్కృతి ఇదే..మా దుస్తుల జోలికి రావద్దు..
దేశంలో అంతర్గత విభేదాలతో అఫ్గాన్ పై విదేశీ జోక్యం పెరిగింది. అలా అఫ్గాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. 1950, 1960లలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే వీలు కలిగింది పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల. కానీ.. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ఇవన్నీ తలకిందులయ్యాయి. షరియా చట్ట ప్రకారం పాలించిన తాలిబన్లు.. బుర్ఖా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు.బురఖా వేసుకోకపోతే వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడేవారు కాదు. తీవ్ర ఆంక్షలు. అంత్యం హింసలు.

Afghanistanculture (2)

 

Read more : Imran Khan : మహిళలు పొట్టి బట్టలు వేసుకోవటం వల్లే అత్యాచారాలు..మగవాడు రోబో అయితే తప్ప..

గతంలో లాగే తాలిబన్లు అదే వైఖరిని అవలంబిస్తే సహించేది లేదంటున్నారు అక్కడి మహిళలు. ‘#Afghanistanculture పేరిట ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. #DoNotTouchMyClothes అంటూ తమ వస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేస్తు హెచ్చరిస్తున్నారు. వందలాది మంది మహిళలు అఫ్గన్‌ సంప్రదాయ దుస్తులు ధరించిన తమ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. మీ హక్కుల పోరాటానికై మీరు చేసే ఉద్యమంలో మా మద్దతు ఎప్పుడు ఉంటుందని నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.కామెంట్ల ద్వారా అఫ్గాన్ మహిళలకు ప్రోత్సాహాన్నిస్తున్నారు.