ఆ ప్లాట్లు అమ్ముకోవద్దని చంద్రబాబు ఎందుకు సూచించారు? రెండో విడత భూములిచ్చేందుకు రైతుల మద్దతు..

భూముల ధరలు ఒక్కసారిగా పెరగబోతున్నాయని.. రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని సూచించారు.

ఆ ప్లాట్లు అమ్ముకోవద్దని చంద్రబాబు ఎందుకు సూచించారు? రెండో విడత భూములిచ్చేందుకు రైతుల మద్దతు..

Chandrababu Naidu

Updated On : November 28, 2025 / 8:35 PM IST

Amaravati: నవ్యాంధ్ర రాజధాని. అమరావతి చుట్టే ఏపీ రాజకీయం. పదేళ్లుగా అదే చర్చ. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చాక రాజధాని ఏరియా మరోసారి కళకళలాడుతోంది. అదే సమయంలో రాజధాని రైతుల సమస్యలు మరోసారి హైలెట్‌ అవుతున్నాయి. ఓ వైపు భూములు ఇచ్చేందుకు సిద్ధమంటూనే..అమరావతికి గెజిట్‌ తీసుకురావాలని పట్టు బడుతున్నారు రైతులు.

సేమ్‌టైమ్‌ తమ సమస్యల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీ సర్కార్ కూడా అమరావతి రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టింది. అమరావతే ఏపీకి గ్రోత్ ఇంజన్.. రాజధాని అభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు నాది భరోసా అని చంద్రబాబు అంటున్నారు. అమరావతి రైతులతో సమావేశమైన చంద్రబాబు కీలక విషయాలను ప్రస్తావనకు తెచ్చారు.

అమరావతి అభివృద్ధి, విస్తరణ ప్రణాళికలు, రైతుల సమస్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతులు త్యాగం వల్లే రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందని గుర్తు చేశారు. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారంటూ ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించే అంశంపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువు పొడిగింపు కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Also Read: చివరి దశకు చేరుకున్న మావోయిస్టుల ఉద్యమం.. కాంగ్రెస్‌కు సాధ్యం కానిది, బీజేపీకి ఎలా సాధ్యమైంది?

అమరావతి రైతులు ప్రధాన సమస్యగా ఉన్న జరీబు, గ్రామ కంఠాలు, లంక భూముల వ్యవహారంపై ఇప్పటికే సర్కార్ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లంక భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునేందుకు అనుమతిచ్చినట్లు చెప్తున్నారు. అమరావతి రైతుల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి, అవసరమైతే తనతో కూడా నేరుగా మాట్లాడొచ్చని రైతులకు భరోసా ఇచ్చారు.

ధరలు పెరగబోతున్నాయా?
ఇకపై అమరావతి రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తానని కూడా చంద్రబాబు హామీ ఇవ్వడంతో అమరావతి రాజధాని రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బిట్స్ పిలానీ, క్వాంటం వ్యాలీ వంటి సంస్థలు వస్తున్నాయని..రాజధాని ఏరియా డెవలప్‌ అవుతుందన్నాయని చెప్పారు చంద్రబాబు. భూముల ధరలు ఒక్కసారిగా పెరగబోతున్నాయని.. రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని సూచించారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యాక రైతులు ఓ క్లారిటీకి వచ్చారని అంటున్నారు. రెండో విడత భూసేకరణకు ఓకే చెప్తూ..ఇకపై అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్‌గా ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని కూడా చెప్పారట.

అమరావతి రైతులు కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్ణయంతో సమస్యలు వచ్చాయని రైతులు మండిపడుతున్నారు. ఆ సమస్యనే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా రైతులు ప్రభుత్వం నుంచి హామీ కోరినట్లు తెలుస్తోంది. భూములిచ్చిన రైతుల్లో 90 శాతం మందికి ప్లాట్లు కేటాయించగా, 10 శాతం మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అలాట్‌ చేయడంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ ఉన్నట్లు చెబుతున్నారు.

పెండింగ్‌లో ఉండిపోయిన అన్ని అంశాలను క్యాబినెట్‌ భేటీలో చర్చించి సాల్వ్‌ చేస్తామని కూడా మాటిచ్చారని అంటున్నారు. ఇక మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు..రెండో విడతలో భూములిచ్చే రైతుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా..ఎవరి భూముల విలువకు తగ్గట్లుగా వారికి ప్లాట్ల కేటాయింపు చేస్తామని చెబుతోంది. అమరావతి రైతుల సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి మరి.