Pakistan New Rule: ఉపాధ్యాయులు జీన్స్,టీ షర్టులు ధరించకూడదు..పాకిస్తాన్ సర్కార్ హుకుం

పాకిస్థాన్ ప్రభుత్వం విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని హుకుం జారీ చేసింది.

Pakistan New Rule: ఉపాధ్యాయులు జీన్స్,టీ షర్టులు ధరించకూడదు..పాకిస్తాన్ సర్కార్ హుకుం

Pakistan Govt Banned Jeans T Shirts And Tites

Pakistan govt banned jeans t shirts and tites : అఫ్గానిస్థాన్ లో తాలిబాన్ల పైత్యం పక్క దేశమైన పాకిస్థాన్ కు అంటుకుందా? అఫ్గాన్ లో ప్రజలు తాము చెప్పిందే చేయాలని..లేదంటే కాల్చిపారేస్తామని పీకమీద కత్తి పెట్టి..నుదుటిన ఘన్ లు పెట్టి మరీ అరాచకాలు చేస్తున్న తాలిబన్ల అరాచకత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి కూడా అంటున్నట్లుగా ఉంది. ఎందుకంటే పాక్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయుల కోసం ఒక డిక్రీని జారీ చేసింది. ఉపాధ్యాయులు ఎలా ఉండాలో..ఎటువంటి బట్టలు వేసుకోవాలో..ఎటువంటి బట్టలు వేసుకోకూడదు?అని విషయంపై ఓ డిక్రీ జారీ చేసింది.ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (FDE) కింద స్కూలు. కాలేజీలు, యూనివర్శిటీలలో ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు లేదా టైట్స్ ధరించకూడదని ఇది పేర్కొంది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇవి ధరించకూడదని వారి కచ్చితంగా సంప్రదాయ దుస్తులే ధరించాలని హుకుం జారీ చేసింది.

ఇమ్రాన్ ప్రభుత్వ కొత్త కోడ్ FDE ద్వారా సెప్టెంబర్ 7 న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో పాకిస్తాన్ ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ”(FDE) పరిశోధన సమయంలో ప్రజల మనస్సుపై దుస్తులు చూపిస్తున్న ప్రభావం ఎక్కువుందని తేలింది. ఈ అభిప్రాయం విద్యార్థులపై మాత్రమే ఉంది. ఉపాధ్యాయులు ధరిస్తున్న దుస్తుల ప్రభావం విద్యార్ధుల మీద పడుతుందనేది స్పష్టం అయింది. అందుకే..మహిళా ఉపాధ్యాయులు ఇప్పటి నుండి జీన్స్ లేదా టైట్స్ ధరించకూడదని మేము నిర్ణయించుకున్నాము. పురుష ఉపాధ్యాయులు కూడా జీన్స్, టీ షర్టులు ధరించకుండా ఉండాల్సిందే. అదేవిధంగా వారు క్లాస్, ల్యాబ్‌లలో టీచింగ్ గౌన్‌లు లేదా కోట్లు ధరించాల్సి ఉంటుంది.

Read more : NEET-2021 : డ్రెస్‌కోడ్ మస్ట్.. అమ్మాయిలు చెవిపోగులు ధరిస్తే నో ఎంట్రీ..!

కాగా..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా ప్రభుత్వం ఉంది. గత వారం బహవల్‌పూర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని..దానిపై మెడికల్ కోటు ధరించాలని పేర్కొంది. ఉపాద్యాయులు క్యాంపస్ ల్లోను, ల్యాబుల్లోను,అధికారిక సమావేశాల్లోను తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.

పాకిస్తాన్ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతోంది. న్యూస్ చానల్స్ లో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఒక ప్రధాని దుస్తులను నినదిస్తున్న దేశంలో ఇటువంటి డిక్రీలు జారీ కావడంలో ఆశ్చర్యం లేదని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పసిబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలు.. హత్యలకు ఏ దుస్తుల నియమాలు కారణమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more : Honeymoon Bed : హనీమూన్ బెడ్..ఒక దిండు ఒక దేశంలో మరో దిండు ఇంకో దేశంలో..

కాగా ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాశ్చాత్య దుస్తులు వేసుకోవటం వల్లా ..ఇతర దేశాల సినిమాలు కూడా దేశంలో లైంగిక నేరాలకు కారణం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ పాశ్చాత్య మనస్తత్వాన్ని నివారించాలని ఒక సమావేశంలో అన్నారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.అవుతున్నాయి కూడా. మొత్తానికి అఫ్గాన్ లోని తాలిబన్ల ప్రభావం పక్క దేశమైన పాకిస్థాన్ పై బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీనికి పాకిస్థాన్‌లోని ప్రముఖ విద్యావేత్త పర్వేజ్ హుద్భాయ్‌ మాట్లాడిన వ్యాఖ్యలే నిదర్శనం. ఒక టీవీ కార్యక్రమంలో పర్వేజ్ మాట్లాడుతు..”మేము ఇప్పటికే చాలా విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నాం..ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవటానికి బదులు తాలిబాన్ పాలనను అవలంబించటానికి పూనుకుంటోందని‘అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.